Keerthy Suresh: అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా ఈ చిన్నది తన జోరును తగ్గించలేదు. ప్రస్తుతం కీర్తి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చియాన్ కీర్తికి నిరాశనే ఎదురయ్యింది. ఈ సినిమా కోసం కీర్తి తాను పెట్టుకున్న నియమనిబంధలను మొత్తం చెరిపేసింది. అందాలను ఆరబోయడమే కాకుండా.. ముద్దులు కూడా ఇచ్చేసింది. అయినా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అమ్మడికి గుర్తింపును తీసుకురాలేదు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. కీర్తి తల్లి మేనకా కూడా నటినే. చిన్నతనం నుంచే తల్లితో పాటు షూటింగ్ కు వెళ్లి బాలనటిగా మెప్పించింది. ఆ తరువాత మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సమయంలోనే మలయాళ హీరో దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేసింది.ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అదే హీరోకు కీర్తి కూతురుగా కూడా నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలా ఎందుకు చేసానో చెప్పుకొచ్చింది.
” దిలీప్ కుమార్ సరసన హీరోయిన్ గా చేయడానికి ఎక్కువ ఆలోచించలేదు. ఆయనతో నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. చిన్నప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలానే ఉన్నారు. ఏమి మారలేదు. కుబేరన్ సినిమాలో ఆయనకు కూతురుగా నటించాను. ఆ తరువాత రింగ్ మాస్టర్ సినిమాలో ఆయనకు లవర్ గా నటించాను. అయితే చిన్నప్పటి నుంచి నేను ఆయనను అంకుల్ అనే పిలిచేదాన్ని.
కానీ, రింగ్ మాస్టర్ సినిమా సమయంలో అంకుల్ అని పిలుస్తుంటే ఆయన వద్దు.. అలా పిలవకు అని చెప్పారు. కావాలంటే చేటా(అన్నయ్య) అని పిలువు అనిచెప్పుకొచ్చాడు. నేను కూడా సరే అని అప్పటి నుంచి ఆయనను చేటా అనే పిలుస్తాను. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది” అని చెప్పుకొచ్చింది.
Thandel: తండేల్ మూవీలో భారీ సర్ప్రైజ్.. చైతూ కోసం క్యామియో రోల్..!
ఇక దీంతో పాటు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు తల్లి మేనక కొన్ని సలహాలు ఇచ్చిందని కూడా కీర్తి చెప్పుకొచ్చింది. “సినిమా అంటే మాములు విషయం కాదు. సెట్ లో టైమ్ కు ఉండాలి. అలా లేకపోతే నిబద్దత లేదనుకుంటారు. నేనెప్పుడూ సెట్ లో టైమ్ కు ఉండేదాన్ని.. నువ్వు కూడా అలానే ఉండాలి అని చెప్పింది. అంతేకాకుండా సెట్ కు వెళ్ళాక క్లాప్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మర్యాద ఇవ్వాలని తెలిపింది” అని చెప్పుకొచ్చింది.
ఇక దిలీప్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సినిమాల ద్వారా కాదుకానీ, వివాదాల ద్వారా అందరికీ తెలుసు. నటి భావన కిడ్నాప్ కేసులో దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. దిలీప్ కేసు మలయాళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. 2017లో నటి భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశారు. దీనివెనుక దిలీప్ ఉన్నట్లు విచారణలో తెల్సింది. ఈ కేసులో దిలీప్ కుమార్ జైలుకి వెళ్లాడు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉండి సినిమాలు చేస్తున్నాడు.