Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు ఎనిమది మంది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. గంగలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
కాగా.. ఇటీవల భద్రాచలంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 20 మందికి పైగా మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నాయకులు కూడా ఉండటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి కొనసాగింపుగా దండకారణ్యంలోకి కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో చొచ్చుకుపోయి.. మావోయిస్టుల శిబిరాల స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని మట్టుబెడతున్నారు.
ఇదిలా ఉండగా.. జనవరి 16న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. సౌత్ బీజాపూర్ అడవుల్లో ఉదయం 9:30 గంటల సమయంలో భద్రతా బలగాలు, మావోయిస్టులక మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ రోజుంతా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్‌లో మూడు జిల్లాల నుంచి రాష్ట్ర పోలీసుల డిస్ట్రిక్ట్ గార్డ, ఐదు బెటాయలియన్ల కోబ్రా సిబ్బంది, సీఆర్పీఎఫ్‌కు చెందిన 229వ బెటాలియన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. జనవరి 12న కూడా బీజాపూర్ జిల్లాలోని మద్దీద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు ఐదుగురు మావోయిస్టులు కూడా ఉన్నారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భద్రతా బలగాలు 219 మంది నక్సలైట్లను హతమార్చాయి. అంతకుముందు, ఛత్తీస్ గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సల్ వ్యతిరేక గస్తీలో సైనికులతో పాటు వెళ్తున్న సీఆర్పీఎఫ్ కుక్క ఐఈడీ పేలుడులో తీవ్రంగా గాయపడింది.
కాగా, ఇటీవల కాలంలో వరుసగా ఎన్‌కౌంటర్(Encounter)లు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టులతో పాటు పలువురు పోలీసు అధికారులు, సామన్య పౌరులు కూడా మృతిచెందుతున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించింది.