Shalini Ajith: స్నేహితుడా.. స్నేహితుడా.. రహస్య స్నేహితుడా.. చిన్ని చిన్ని నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా.. సాంగ్ గుర్తుందా.. ? ఈ జనరేషన్ లో చాలా తక్కువమందికి తెలిసి ఉండొచ్చేమో కానీ, 24 ఏళ్ళ క్రితం ఈ సాంగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ప్రేమించిన ప్రతి అమ్మాయి.. కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు.. తమ ప్రియుడును, భర్తకు ఇదే సాంగ్ ను డేడికేట్ చేసేవాళ్ళు అంటే అతిశయోక్తి కాదు. అంతలా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ సఖి చిత్రంలోనిది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్, షాలిని జంటగా నటించారు.
ఇక ఈ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక మ్యాడీ ఈ సినిమాతో లవర్ బాయ్ గా మారిపోయాడు. బాలనటిగా పరిచయమైన షాలినికి హీరోయిన్ గా మంచి పేరును తీసుకొచ్చిపెట్టిన చిత్రం ఇది. ఇక ఈ సినిమా తరువాత షాలిని.. తెలుగులో కనిపించలేదు. తమిళ్ లో కొన్ని చిత్రాలు చేసి .. అజిత్ ప్రేమలో పడి అతనినే పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన ఆమె .. పిల్లల ఆలానాపాలనా చూసుకుంటూ గృహిణిగా సెటిల్ అయ్యింది.
Mahesh Babu: కృష్ణుడిగా మహేష్ బాబు.. ఇదే కనుక నిజమైతే.. థియేటర్లే ఆలయాలు.. ?
అంతకుముందు షాలిని ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండేది కాదు. కానీ, ఈ మధ్య షాలిని సైతం ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. భర్త అజిత్, చెల్లి షామిలి, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా షాలిని.. మాధవన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ .. చిరునవ్వుల చిరుజల్లు అని తమిళ్ లో రాసుకొచ్చింది.
ఇక ఇదే ఫోటోను మాధవన్ షేర్ చేస్తూ.. ఇన్నేళ్ల తరువాత షాలినిని కలవడం చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్స్ యూ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక 24 ఏళ్ళ తరువాత కార్తీక్, శక్తి (సఖి సినిమాలో పాత్రల పేర్లు) ఇలా కలిశారు. అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.మాధవన్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మరి ఈసారి మాధవన్ తెలుగులో ఏమైనా కొత్త ప్రాజెక్ట్ తో కనిపిస్తాడేమో చూడాలి.