Salman Khan : ముంబైలో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ భద్రతను మరింత పెంచారు. సల్మాన్ ఖాన్ ఇల్లు ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా ఆయన ఇంటి బాల్కనీ ఫోటోలు బయటకు రాగా, అందులో బాల్కనీని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో క్లోజ్ చేసినట్టుగా కన్పిస్తోంది.
గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు కోర్టుకి ఉపశమనం ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం ఆయనను వదలట్లేదు. తాము ఎంతో పవిత్రంగా భావించే కృష్ణ జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ ను వదిలిపెట్టే ఆలోచన లేదని బిష్ణోయ్ గ్యాంగ్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇక ఎప్పుడు పడితే అప్పుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురవ్వడం అన్నది సాధారణంగా మారిపోయింది. గత ఏడాది ఆయనకు ఎన్నిసార్లు ప్రాణహాని బెదిరింపులు ఎదురయ్యయో లెక్కలేదు.
కొన్నాళ్ల క్రితమే సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆప్తమిత్రుడైన బాబా సిద్ధిఖీని మర్డర్ చేసి, నెక్స్ట్ నువ్వే అంటూ వార్నింగ్ ఇచ్చింది బిష్ణోయ్ గ్యాంగ్. అయితే గతంలో కూడా సల్మాన్ ఖాన్ మర్డర్ కి ప్లాన్ చేశారు. గత ఏడాది సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మాత్రమే కాదు, ఆయన ఫామ్ హౌస్ దగ్గర కూడా కాల్పులు జరిపారు. ఆ వ్యక్తిని హర్యానాలో పోలీసులు పట్టుకున్న పోలీసులు, బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన వ్యక్తులను కూడా పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఈ కేసుపై విచారణ జరుగుతుండగా, తాజాగా సల్మాన్ ఖాన్ కావడం ఇల్లు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఓవైపు ఇంతగా ప్రాణహాని బెదిరింపులు ఎదురవుతున్నప్పటికీ, సల్మాన్ ఖాన్ (Salman Khan) ఏ మాత్రం భయపడకుండా తను కమిట్ అయిన సినిమాలు, షోల షూటింగ్లకు వెళ్తున్నారు. భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ బయట కన్పించడానికి జంకడు. ఇక ఆయన బయటకు వస్తే భారీ సెక్యూరిటీ ఉండాల్సిందే. రీసెంట్ గా సల్మాన్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంబానీ ఫ్యామిలీతో కలిసి తన 59వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు.
సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘సికందర్’ (Sikandar) అనే సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ‘సికందర్’ చివరి షెడ్యూల్ జనవరి 10న ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. ‘సికందర్’ ఈద్ 2025న థియేటర్లలో విడుదల కానుంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.