Sikandar: ఒకప్పటి పాపులర్ పాటలను రీమిక్స్ చేయడం ఈరోజుల్లో మేకర్స్‌కు మామూలు విషయం అయిపోయింది. ఒకప్పుడు క్లాసిక్‌గా నిలిచిపోయిన పాటలను కూడా ఈరోజుల్లో రీమిక్స్ చేస్తూ వాటికి ఉన్న అందాన్ని పోగొడుతున్నారని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అయినా కూడా మేకర్స్ ఆ కామెంట్స్ ఏమీ పట్టించుకోకుండా తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడం కోసం పాత పాటలను ఉపయోగించుకుంటున్నారు. అలాగే సీనియర్ హీరోలు సైతం దీనికి అభ్యంతరం చెప్పకుండా ఒకప్పటి తమ పాటలనే రీమిక్స్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. అలా సల్మాన్ ఖాన్ కూడా ఒక పాత పాట రీమిక్స్‌తో తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
శరవేగంగా షూటింగ్
మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రమే ‘సికందర్’. తమిళ దర్శకుడు అయిన మురుగదాస్ ఇప్పటికే పలు బాలీవుడ్ సీనియర్ హీరోలకు గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా తనే హిట్ ట్రాక్ తప్పాడు. అందుకే సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అలా ఇప్పటికే ‘సికిందర్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. ఇక ఈ మూవీని రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ముందు నుండే కష్టపడుతున్నారు. దానికి తగినట్టుగానే త్వరత్వరగా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ నుండి ఒక సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.
స్పెషల్ సాంగ్
ఇప్పటికే ‘సికందర్’ (Sikandar) సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి అప్డేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందట. ముంబాయ్‌లోని స్టూడియోలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan), రష్మిక మందనా (Rashmika Mandanna) కలిసి ఒక పాపులర్ పాత పాట రీమిక్స్‌కు స్పెప్పులేశారని తెలుస్తోంది. లతా మంగేష్కర్ పాడిన ఒక పాత పాటకు ఇది రీమిక్స్ అనే విషయం బాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Also Read: ఎవరీ గౌరీ స్ప్రాట్.? అమీర్ ఖాన్ డేటింగ్ చేస్తున్న ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా.?
నెటిజన్ల ట్రోల్స్
ఇంతకీ ‘సికిందర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఏ పాటను రీమిక్స్ చేస్తున్నాడనే విషయం బయటికి రాకపోయినా.. పాత పాటకు రీమిక్స్ అనగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. ఇప్పటికే సల్మాన్, రష్మిక కలిసి స్టెప్పులేసిన ఒక డ్యాన్స్ నెంబర్ తాజాగా విడుదలయ్యింది. అందులో వీరిద్దరి పెయిర్‌కు అంత మంచి మార్కులు పడలేదు. అసలు సల్మాన్‌కు హీరోయిన్‌గా రష్మిక సెట్ అవ్వలేదని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక కొన్నాళ్ల ముందు విడుదలయిన టీజర్‌లో కూడా రష్మిక ఎక్కువసేపు కనిపించలేదు. కేవలం ఒక్క సీన్‌లోనే తళుక్కున మెరిసింది. అలా ‘సికిందర్’పై అప్పుడే కొందరు ప్రేక్షకులు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.