IMD alert: భారతదేశంలో గత రెండు రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 15 నుంచి 17 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముండగా, మరికొన్నిచోట్ల వేడిగాలులు ప్రభావం చూపే అవకాశముంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే వేడి ప్రభావం, వర్షాల ప్రభావం ఎక్కడెక్కడ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాలు పడే ప్రాంతాలు
భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది:
ఉత్తరాది రాష్ట్రాలు – పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్
తూర్పు భారత రాష్ట్రాలు – పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్
దక్షిణాది రాష్ట్రాలు – కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ
ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తీవ్రమైన స్థాయిలో ఉండే అవకాశం ఉంది. తూర్పు భారత రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా వర్షపాతం ఏర్పడే అవకాశముంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సగటున 35°C – 40°C మధ్య ఉండే అవకాశం ఉంది.
వేడిగాలుల ప్రభావం ఎక్కడ
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భలో వేడి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఒడిశాకు మార్చి 14 నుంచి 17 వరకు తీవ్రమైన వేడి తీవ్రత ఉండే ఛాన్సుంది
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మార్చి 15న ఉష్ణోగ్రతలు 42°C – 44°C మధ్య నమోదయ్యే అవకాశం
జార్ఖండ్ రాష్ట్రంలో మార్చి 15 నుంచి 17 వరకు తీవ్రమైన వేడి ప్రభావం ఉంటుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది
సౌరాష్ట్ర & కచ్ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించే అవకాశముుంది.
Read Also: Business Idea: సున్నా పెట్టుబడి, ఒకేచోట కూర్చుని చేసే బిజినెస్
వాతావరణ పరిస్థితులు
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది. తూర్పు, దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఒడిశా, విదర్భ ఛత్తీస్‌గఢ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45°C వరకు చేరే అవకాశం ఉంది.
రెడ్ అలర్ట్
ఈ క్రమంలో వాతావరణ శాఖ ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, సౌరాష్ట్ర & కచ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో కూలింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. బయట ఎక్కువ సమయం గడపకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావంతో
ఉత్తర భారతదేశంలో వర్షపాతం వల్ల వ్యవసాయ పనులకు కొంత వరకూ ఆటంకం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. తూర్పు రాష్ట్రాల్లో వర్షాలు వ్యవసాయానికి లాభదాయకం కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో భూమి తడిచి, రబీ పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
జాగ్రత్తలు
తగినంత నీటిని తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరుచుకోవడం కోసం తేలికపాటి, దుస్తులను ధరిం చాలి. ఎక్కువగా ఎండలో ఉండే పనులను తగ్గించుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఎండ తీవ్రత నుంచి దూరంగా ఉండాలి.