BigTV English

Samantha: నా ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్లే.. ఇష్టాలను బయటపెట్టిన సమంత

Samantha: నా ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్లే.. ఇష్టాలను బయటపెట్టిన సమంత

Samantha: సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఎంత పోటీ ఉందో.. వారంతా కలిసి ఒకరికొకరు అంతే సపోర్ట్ చేసుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే వేరే హీరోయిన్స్‌కు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారికి సపోర్ట్‌గా నిలబడుతుంటారు. తాజాగా సమంత కూడా ఇటీవల కాలంలో తనకు నచ్చిన హీరోయిన్స్ ఎవరు, సినిమాలు ఏంటి అనే విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. కొన్నాళ్లు సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేని సమంత.. సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. అలా వారితో కాసేపు కబుర్లు చెప్పడం కోసం తాజాగా ‘యాస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌ను ఏర్పాటు చేసింది. అందులో తన ఫేవరెట్ హీరోయిన్స్ గురించి బయటపెట్టింది.


ఫ్యాన్స్‌తో కబుర్లు

ప్రస్తుతం సమంత.. సినిమాలకు దూరంగా ఉంటూ వెబ్ సిరీస్ వరల్డ్‌లోనే బిజీ అయిపోయింది. రాజ్ అండ్ డీకే.. ఇద్దరూ కలిసి తనను ఈ వెబ్ సిరీస్‌లకు పరిచయం చేశారు. అందుకే తను హిందీలో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా కూడా వెబ్ సిరీస్‌లతోనే అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇప్పటికే వారి దర్శకత్వంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు కూడా రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ షూటింగ్‌తో బిజీ అయ్యింది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం కోసం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.


పెద్ద లిస్ట్

‘ఇది నాకు నచ్చిన కొన్ని సినిమాలకు, హీరోయిన్స్‌కు షౌటౌట్. ఉల్లోరుకు సినిమాలో పార్వతి, సూక్ష్మదర్శిని సినిమాలో నజ్రియా, అమరన్ సినిమాలో సాయి పల్లవి, జిగ్రా సినిమాలో ఆలియా భట్, కంట్రోల్ సినిమాలో అనన్య పాండే.. నాకు వీళ్లంటే ఇష్టం, వీళ్లు చేసే పని అంటే ఇష్టం. వాళ్లు ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు. అదంత ఈజీ కాదు. వీళ్లంతా రాక్‌స్టార్స్‌తో సమానం’ అంటూ తనకు నచ్చిన సినిమాలు, అందులో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్‌ల గురించి తెగ పొగిడేసింది సమంత. మామూలుగా హీరోయిన్స్.. ఇతర హీరోయిన్స్ పర్ఫార్మెన్స్‌ను ప్రశంసించడం కామన్‌గా జరిగేదే అయినా సమంత మాత్రం వీరందరినీ తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిందని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read: అనుష్కలో ఎంత మార్పు.! షాక్‌లో ఫ్యాన్స్, అసలు ఇది నిజమేనా.?

దానికోసం ఎదురుచూస్తుంటాను

తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఆల్ వీ ఇమాజిన్ ఈజ్ లైట్’ అనే సినిమా ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ ఇండస్ట్రీకి అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమా గురించి కూడా సమంత (Samantha) ప్రస్తావించింది. అందులో హీరోయిన్స్‌గా నటించిన కని, దివ్య ప్రభా పర్ఫార్మెన్స్‌లు కూడా తనకు నచ్చాయని చెప్పుకొచ్చింది. వాళ్లు చేసే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటానని తెలిపింది. దీంతో సమంత.. ఇతర హీరోయిన్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇతర హీరోయిన్స్ కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి సమంత సినిమాలకు, పర్ఫార్మెన్స్‌కు సపోర్ట్ చేస్తూనే ఉంటారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×