BigTV English

Samantha: చైతన్య నాకు ఇచ్చిందేం లేదు.. అంతా సినిమా వల్లే.. సమంత వైరల్ కామెంట్

Samantha: చైతన్య నాకు ఇచ్చిందేం లేదు.. అంతా సినిమా వల్లే.. సమంత వైరల్ కామెంట్

Samantha: ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే, ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ తో కొంతకాలంగా బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఆమె మళ్ళీ తిరిగి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారుతున్నారు. తాజాగా ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగచైతన్య సమంత విడిపోయి చాలా రోజులైనా ఇంకా ఫ్యాన్స్ వారి గురించి మాట్లాడుకోవడం మనం వింటూనే ఉన్నాం. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో తను మొదటిసారి చేసిన సినిమా ఏం మాయ చేసావే గురించి చెబుతూ నాగచైతన్య గురించి మాట్లాడారు.


అంతా సినిమా వల్లే.. సమంత..

సుమతో శుభం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో సమంత తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. సుమ మీరు ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ గా మంచి మంచి సినిమాలలో నటించారు. ఇక ఇప్పుడు నిర్మాతగా ఎందుకు మారారు అని అడగ్గా.. సమంత మాట్లాడుతూ.. ‘నాకు సినిమా అంటే పిచ్చి. నేను మొదటిసారి గౌతమ్ మీనన్ గారు చాలా రిస్క్ తీసుకొని, నన్ను ఏం మాయ చేసావే మూవీ కి ఎంపిక చేశారు. ఆయన ఆడిషన్ వల్లే నేను ఈరోజు పొజిషన్ లో కూర్చుని ఉన్నాను. ఏం మాయ చేసావే నా కెరియర్ ను మార్చేసింది. సినిమా అంటే నాకు బాధ్యత ఉంది. కొత్తవారిని ఎంకరేజ్ చేయాలి. వారిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలి. వీళ్లంతా బాగా యాక్టింగ్ నేర్చుకున్నవారు. నేను ఏ మాయ చేసావే సినిమా తీసేటప్పుడు నాకు అసలు యాక్టింగ్ గురించి అంత బాగా తెలియదు. ఆ వయసులో సినిమా నటన, గురించి అసలు తెలియదు. వీళ్లంతా ఇప్పుడు చాలా టాలెంటెడ్ పర్సన్స్. ట్రాలాల స్థాపించడానికి కారణం కొత్త వారిని ప్రోత్సహించటం. నేను మూవీస్ తో బిజీగా, బిజినెస్ లో ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించే టైంలో నాకు ఈ ట్రాలాల స్థాపించాలనే ఆలోచన వచ్చింది. నాకు హీరోయిన్గా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఏదో చేయాలి అని ఆలోచన నాకు రాలేదు. హిమాంక్ తో కలిసి ఒకరోజు మాట్లాడుతుండగా ఈ ఆలోచన వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీ అని ఆమె తెలిపింది. ఏం మాయ చేసావే సినిమా వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని.. చైతన్య నాకు ఇచ్చింది ఏం లేదు అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడరు. ఈ వీడియో చూసిన వారంతా సమంత టాలెంట్ తో పైకి వచ్చిందని, ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


ప్రొడ్యూసర్ గా మొదటి ప్రయత్నం ..

సమంత ఈ చిత్రంలో మాతాజీ పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఈ పాత్ర కోసం వేరే వారిని అడగడం ఇష్టం లేక తానే ఈ క్యారెక్టర్ చేసినట్టు తెలిపారు.ప్రతి సినిమా కథకు ఎంత బడ్జెట్ కావాలో ప్రొడ్యూసర్ కి అర్థమవుతుంది నేను అలానే ఈ కథకు బడ్జెట్ విషయంలో ఎటువంటి లోటు లేకుండా చిత్రాన్ని నిర్మించాను అని తెలిపింది. ఈ మూవీ కదా ఒక ఊరిలోనే ఉండే ముగ్గురు మహిళలు సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తారు. సమాజంలో సీరియల్స్ ప్రభావం ఏ విధంగా పడుతుంది అని సరదాగా వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం,శ్రావణి లక్ష్మి, కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను క్వింటన్ సిరోజో సంగీతాన్ని అందించారు. జన్మజన్మల బంధం ఈ పాట ఇప్పటికే రిలీజ్ అయి ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Ram Charan Peddi : పెద్ది షాట్ రీ క్రియేట్… ఢిల్లీ క్యాపిటల్స్‌ను పొగుడుతూనే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×