Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో తెలుగు స్టార్ హీరోలు అందరితోనూ నటించారు. ఈ అమ్మడు తెలుగులోనే కాక హిందీ, తమిళ్ భాషల్లో చిత్రాలతో నటించి మెప్పించారు. నాగచైతన్యతో 2017లో ఆమె వివాహం జరిగింది. టాలీవుడ్ లో స్టార్ క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వీరు 2021లో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నరు. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ తో కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడే తిరిగి తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలో చురుగ్గా అభిమానులతో టచ్ లో వుండే సమంత.. తాజాగా ఆమె ఇన్స్టాల్ లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టిందో చూద్దాం..
సమంత పోస్ట్ .. అతనిని ఉద్దేశించేనా?
ఏమాయ చేసావే అంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగు ప్రజలను తన అందం, నటనతో మాయ చేసారు. వరుసగా తర్వాత ఎంతోమంది హీరోలతో ఎన్నో మూవీస్ లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నటిగా ఆమె ఎంతో మందిని చూసింది. ఎన్నో లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయినా ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనను ఇంకా మర్చిపోలేదా అంటే, ఆమె దగ్గర సన్నిహితులు నిజమనే అంటారు. తాజాగా సమంత తన ఇన్స్టాల్ లో ఓ పోస్టును షేర్ చేశారు. ఆ పోస్టులో ఆమె చిన్న ప్రయాణమే కానీ.. రోడ్డు చాలా పెద్దది. ట్రాలాల ప్రయాణం కొత్తగా మొదలు పెట్టాలి అని క్యాప్షన్ తో తన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా తన జీవితం చాలా పెద్దదని నాగచైతన్య తో పెళ్లి ప్రేమ విడిపోవడం చాలా చిన్న ప్రయాణంగా, ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్లాలని ఉద్దేశం వచ్చేటట్లుగా ఆమె పోస్ట్ చేశారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిర్మాతగా కొత్తగా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్లు శ్యామ్ పెట్టిన ఈ పోస్ట్ తో తను ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ పోస్ట్ కి ఆల్ ది బెస్ట్ సామ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ ..ఇప్పుడు ప్రొడ్యూసర్ ..
ఇక సమంత తొలిసారిగా నిర్మాతగా మారి శుభం సినిమాతో, కొత్త నటీనటుల తో మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటిగా ఎంతో చూశాను ఎన్నో లక్షల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాను కానీ, ఇంకా ఏదో చేయాలి సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఏదైనా సాధించాలి అన్న కోరికతో నిర్మాతగా మారి ఈ రంగంలోకి వచ్చాను అని, 15 సంవత్సరాలుగా కెరియర్ ని మొదలుపెట్టి ఎన్నో చూశానని.. ఇప్పుడు కొత్తవారికి ఎంకరేజ్ చేసి వారిని పైకి తీసుకురావాలని ఈ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించానని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శుభం మూవీ అంతా సీరియల్స్ చూసే ముగ్గురు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుంది. సమంత ఈ మూవీ లో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jayasudha: పాత్రలు నచ్చకపోయినా యాక్ట్ చేశా… పాత రోజులు గుర్తుతెచ్చుకున్న జయసుధ