BigTV English

MLA Raja Singh: ఓల్డ్ సిటీలో ఉన్నది వాళ్లే.. వెంటనే పంపేయండి: రాజా సింగ్

MLA Raja Singh: ఓల్డ్ సిటీలో ఉన్నది వాళ్లే.. వెంటనే పంపేయండి: రాజా సింగ్

MLA Raja Singh: భారత ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, అక్కడి పాలకుల గుండెల్లో టన్నుల కొద్ది భయం స్టార్ట్ అయ్యింది. భారత్ ఆర్మీ కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, స్థావరాలు మీద మాత్రమే దాడులు నిర్వహించింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా.. భారత సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం.. భారత్ మీద ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తుంది. భారత్ దాడులను పిరికి చర్యగా అభివర్ణించిన పాక్ ప్రధాని షరీఫ్.. తమ సైన్యం ధీటుగా సమాధానం చెబుతోందని చెబుతున్నారు.


అయితే, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన భారత్ ఆర్మీని యావత్ భారత్ దేశం అభినందిస్తోంది. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందేనని.. భారత్ ఆర్మీ అదే చేసేందని దేశ వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆర్మీ మిసైల్స్ అటాక్ పై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి  ప్రతీకార చర్యగా మన దేశ సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల్ని చావుదెబ్బ కొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని హిందువులో కాదో నిర్థారించుకుని మరీ చంపినందుకు ఉగ్రవాదులకు దక్కిన ప్రతిఫలం ఇదే అని ఆయన చెప్పారు. ఏప్రిల్ 22న  పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజే.. మన దేశ పౌరులను చంపిన టెర్రరిస్టుల్ని వదలబోనని మోదీ సంకల్పం చేశారని, నేడు దానిని నెరవేర్చారని చెప్పారు. ఉగ్రవాదుల దాడి సమయంలో ఒక మహిళ ఆవేదనతో తన భర్తను చంపవద్దని ఉగ్రవాదిని ప్రాధేయపడగా.. ‘వెళ్లి మీ మోదీకి చెప్పుకో’ అని అన్న విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. మోదీకి చెప్తే వచ్చే రిజల్ట్ ఇలానే ఉంటుందని చెప్పారు. హిందూ మహిళల బొట్టు తీసేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అని.. ఇంకా అసలు ముందుందని వివరించారు.


Also Read: Mock drill: 50 ఏళ్ల తర్వాత మోగనున్న వార్ సైరన్.. వెంటనే ఇలా చెయ్యండి

ఇండియన్ ఆర్మీ చేసిన మెరుపు దాడులపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా.. ఇలాంటి సమయంలో కేవలం దాడులు మాత్రమే చేస్తే సరిపోదని ఆయనన్నారు. పాకిస్థాన్ దేశం ఓ టెర్రరిజం ఫ్యాక్టరీ అని.. పాకిస్థాన్ పై యుద్ధం చేసి మొత్తాన్నీ ఖతం చేయాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు. పాకిస్థాన్ దేశ నలుమూలల నుంచి టెర్రరిస్టులు పుటకొస్తున్నారని.. ఈ విషయంపై ప్రధాని మోదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీలో 15 నుంచి 20వేల మంది రోహింగ్యా బంగ్లాదేశీ, పాకిస్తానీలు ఉండొచ్చని.. ఏ దేశం నుంచి వచ్చారో అక్కడికే వారిని.. పంపియ్యాలని సీఎం రేవంత్ ను ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు.

Also Read: India Pak War: పాక్ పగ.. ఉగ్రవాదులకు మద్దతుగా ఎదురుదాడికి సన్నాహాలు

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×