ఒకప్పుడు పలు ప్రైవేటు కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా కెరియర్ ఆరంభించిన యష్ (Yash ) ఆ తర్వాత యాడ్స్ చేస్తూ.. ఒక మోస్తారు గుర్తింపు అందుకున్నారు. ఇక ఎప్పుడైతే సీరియల్స్ లోకి వచ్చారో .. అప్పుడు దర్శకుల కంట్లో పడ్డారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశాన్ని దక్కించుకున్నారు.. ముఖ్యంగా ఈయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘కేజిఎఫ్’ సినిమాలు చేసి, పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇదిలా ఉండగా ఈరోజు ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే విధంగా మరొకవైపు ఆయన ప్రముఖ మలయాళ లేడీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నారు.
ఒక్క సినిమాతో భారీగా పెరగనున్న రెమ్యునరేషన్..
ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే యష్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే హీరో యష్ ఆస్తుల విలువ ఎంత? ఆయన ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం హీరో యష్ బాలీవుడ్ హిందీ రామాయణం సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రావణ గెటప్లో విలన్ గా నటించడం కోసం ఏకంగా రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే కేజిఎఫ్ సినిమాలకు ముందు వరకు ఒక్కో సినిమాకి రూ.7 కోట్లు పారితోషకం తీసుకున్న ఈయన, ఆ సినిమా విజయం సాధించడంతో వందల కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.
హీరో యష్ ఆస్తుల విలువ..
ఇకపోతే ఇప్పటివరకు హీరో యష్ ఆస్తి విలువ కేవలం రూ. 53 కోట్లు మాత్రమే. ఇక హిందీ రామాయణం సినిమా విడుదలైన తర్వాత ఈయన ఆస్తి విలువ దాదాపు రూ.253 కోట్లు అవుతుంది అనడంలో సందేహం లేదు. ఒక్క సినిమాతో భారీ జాక్పాట్ కొట్టబోతున్నారు. ఈ హీరో ఆస్తుల విషయానికి వస్తే గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో రూ .6కోట్ల విలువైన ఇల్లు ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో ఆ ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఇక ఈయన కారు గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు కూడా ఉంది. అలాగే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి , పజేరో స్పోర్ట్స్ హై ఎండ్ కార్లు ఈయన సొంతం.
యశో మార్గా ఫౌండేషన్..
రాధిక పండిట్ ను వివాహం చేసుకున్న ఈయన తన భార్యతో కలిసి 2017లో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి కొరతను పరిష్కరించడానికి ‘యశో మార్గా ఫౌండేషన్’ ని కూడా స్థాపించారు. ఇక అంతే కాదు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే ఈయన, సమాజ సేవ చేస్తూ ప్రజలలో మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు రాబోయే టాక్సిక్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు యష్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.