BigTV English

Committee Kurrollu: నమ్మండి.. ఇక ప్రతి జాతరలో ఇదే పాట వినిపిస్తుంది

Committee Kurrollu: నమ్మండి.. ఇక ప్రతి జాతరలో ఇదే పాట వినిపిస్తుంది

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక విడాకుల తరువాత కెరీర్ మీద ఫోకస్ చేసిన విషయం తెల్సిందే. ఒకపక్క నటిగా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారింది. ఇక ప్రస్తుతం నిహారిక నిర్మిస్తున్న చిత్రం కమిటీ కుర్రాళ్లు. 11 మంది కొత్త హీరోలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.


సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఋశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌వర్మ, ప్రసాద్‌ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్‌ కుమార్‌ పరిమి, శ్యామ్‌ కల్యాణ్‌, రఘునందన్‌, శివకుమార్‌ మట్ట, అక్షయ్‌ శ్రీనివాస్‌, శరణ్య సురేశ్‌, తేజస్విరావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి, ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఒక్కో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి మరో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సందడి సందడి చేసే కుర్రోళ్ళు అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అమ్మోరు తల్లి జాతరలో వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది.


సుక్కల జాజులు జడలో.. చేతిని గాజులు ఘల్లో.. కాసుల పేరులు మెడలో.. ఊపుకు కుర్రాళ్లు జిల్లో జిల్లో అంటూ సాంగ్ అంతా రైమింగ్ తో నింపేశాడు లిరిసిస్ట్ సింహాచలం మన్నెల. జాతరలో సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కూడా ఒక్కసారి ఉంటే.. రిపీట్ లో పెట్టుకొని వినాలనే ఉంది. ఆ మ్యూజిక్ కు, అనుదీప్ వాయిస్ కు కాలు కదపకుండా ఉండరు.

ఇక జాతరలో జరిగే ప్రతి ఘట్టాన్ని విజువల్ గా చాలా బాగా చూపించారు. అనుదీప్ కేవీ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇకనుంచి ప్రతి జాతరలో ఇదే పాట వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో నిహారిక నిర్మాతగా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×