BigTV English

Sandhya Theater Case : అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్… కేసు విత్ డ్రా చేసుకున్న రేవతి భర్త

Sandhya Theater Case : అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్… కేసు విత్ డ్రా చేసుకున్న రేవతి భర్త

Sandhya Theater Case : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. జానీ మాస్టర్ కేసు, అక్కినేని నాగార్జున హైడ్రా విషయంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇక రీసెంట్ గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూస్. ఇప్పుడు సంధ్య థియేటర్ ఇష్యూ కూడా సీరియస్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో డిసెంబర్ 4వ తారీఖు రాత్రి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు వచ్చి పుష్ప సినిమాను చూశారు. అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద ఒక్కసారిగా ప్రేక్షకులు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేశారు. అయితే అక్కడ తొక్కేసిలాట జరగడంతో రేవతి ఆయన ఆమె మృతి చెందింది. అలానే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు.


ఇక ఈ ఘటనకు సంబంధించి ఇదివరకే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనికి సంబంధించి మా కంటూ ఏమీ తెలియదు అని వాళ్ళ పద్ధతిలో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ వాళ్లకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కూడా సంతాపాన్ని తెలియజేసింది. అల్లు అర్జున్ ఏకంగా మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియోను విడుదల చేసి ఆ కుటుంబ సభ్యులకు తన క్షమాపణలు, తన ప్రగాఢ సానుభూతిని తెలిపి 25 లక్షలు నష్టపరిహారంగా ఇస్తాను అని తెలిపాడు. అంతేకాకుండా హాస్పిటల్ ఖర్చులతో పాటు ముందు ముందు ఆ ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నిలబడతాను అంటూ ఆ వీడియోలో తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన అంశం అయిపోయింది అనుకునే తరుణంలో ఇప్పుడు మరోసారి ఈ ఘటన తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్ రీసెంట్ గా అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. ఇక ఈ కేసు గంట గంటకు మలుపులు తీసుకుంటుంది.
అల్లు అర్జున్ పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదని పేర్కొన్నాడు. అయితే భాస్కర్ స్టేట్మెంట్ విన్న కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు భాస్కర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అభిమానం అంటే ఎలా ఉండాలి అని కొంతమంది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ కేసు కు సంబంధించి 14 రోజులు పాటు అల్లు అర్జున్ రిమాండ్ కి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read : Allu Arjun – Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ రియాక్షన్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×