Hair Growth Tips: జుట్టు పొడవుగా, సిల్కీగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు కావచ్చు. నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ ఇతర కారణాలు కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే జుట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేందుకు బయట మార్కెట్లో వివిధ రకాల హెయిల్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు.
ఇవి రసాయనాలతో తయారు చేసినవి గనుక జుట్టు చిట్లిపోయి.. ఊడిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి హానీ కలగకుండా జుట్టు పొడవుగా పెరిగేందుకు మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేశారంటే.. హెయిర్ ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు..
కొబ్బరి నూనె
కరివేపాకులు
వేపాకులు ఐదు
చిన్న ఉల్లిపాయ
రెండు, మూడు మందార పువ్వులు
మూడు- మందారం ఆకులు
కలోంజీ సీడ్స్ ఒక టీ స్పూన్
మెంతులు రెండు టేబుల్ స్పూన్
లవంగాలు 10
తయారు చేసుకునే విధానం..
ముందుగా కరివేపాకు, వేపాకులు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, మందార పువ్వులు, మందారం ఆకులు, కలోంజీ సీడ్స్, మెంతులు, లవంగాలు మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీపట్టండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. అందులో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి ఒక 20 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత చల్లారనిచ్చి గాజు సీసాలో వడకట్టండి. అంతే సింపుల్ హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లే.. ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. కొద్దిరోజుల్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ ఆయిల్‌లో ఉపయోగించే పదార్ధాలలో విటమిన్స్, పోషకాలు అధికంగా ఉంటాయి.
Also Read: స్మోకింగ్ అలవాటు లేకపోయిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి?
జుట్టు పెరుగుదలకు మరొక చిట్కా..
కావాల్సిన పదార్ధాలు..
మెంతులు
ఉల్లిపాయ
కరివేపాకు
టీ పొడి
బ్లాక్ సీడ్స్
లంవంగాలు నాలుగు
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం..
స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొబ్బరి నూనె, టీ పొడి, కరివేపాకులు, ఉల్లిపాయ ముక్కలు, బ్లాక్ సీడ్స్, మెంతులు, లవంగాలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత గాజు సీసాలో వడకట్టండి. ఈ హెయిర్ ఆయిల్ వారానికి మూడు సార్లు అప్లై చేస్తే.. జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. తెల్లజుట్టును కూడా నివారిస్తుంది. ఈ ఆయిల్ వల్ల చుండ్రు సమస్యలు తొలగిపోతాయి కూడా. ఇందులో ఉపయోగించే పదార్ధాలలో జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జుట్టుకు ఎలాంటి హానీ కలగదు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.