Sankranthiki Vasthunam : ఈసారి సంక్రాంతి సందర్భంగా ముగ్గురు హీరోలు బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ఒకరు. ఈసారి తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ కంటెంట్ తో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు వెంకీ మామ. తాజాగా ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ టికెట్ రేట్లు…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదల రోజు నుంచి మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని సింగిల్ స్క్రీన్ లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 పెంచుతూ అనుమతించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో ‘సంక్రాంతి వస్తున్నాం’ టికెట్ ధరలు మల్టీప్లెక్స్ లలో రూ. 245 నుంచి రూ. 302 వరకు ఉండబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ లలో రూ.175 ఉంటుంది. అలాగే మూవీ రిలీజ్ రోజు అంటే జనవరి 14న 6 షోలకు, జనవరి 15న 5 ఆటలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోను జారీ చేసింది.
‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) టికెట్ ధరలు…
ఇక ఇదే సంక్రాంతికి జనవరి 12న ‘డాకు మహారాజ్’ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ లలో 110, మల్టీప్లెక్స్ లో 135 పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఏపీలో బెనిఫిట్ షోలకు 500 పెంచారు. అయితే తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచే అవకాశం లేదు.
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) టికెట్ ధరలు…
ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లలో 135, మల్టీప్లెక్స్ లో 175 టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిచ్చారు. అలాగే బెనిఫిట్ షోల టికెట్ రేట్లను 600గా నిర్ణయించింది ప్రభుత్వం. ఇక తెలంగాణలో కూడా దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు తెలంగాణ ప్రభుత్వం 4 గంటల నుంచి 6 గంటల వరకు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు… సింగిల్ స్క్రీన్ లో అదనంగా 100, మల్టీప్లెక్స్ లో 150 పెంచుకోవడానికి అనుమతినిచ్చింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్రేక్ ఈవెన్ టార్గెట్…
అయితే అన్ని సినిమాలకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకే టికెట్ ధరలు తక్కువగా ఉండడం గమనార్హం. ఇదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కాబోతోంది. టికెట్ ధర తక్కువ కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీలతో కలిసి సినిమాను చూడాలనుకునే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నైజాంలో దిల్ రాజు స్వయంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండగా, ఆంధ్రాలో 15 కోట్లకి, సీడెడ్ 5 కోట్లకి థియేట్రికల్ రైట్స్ ను సేల్ చేశారు. 50 కోట్ల కంటే తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది.