Sapthagiri: ఈరోజుల్లో రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నామని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కథ నచ్చింది, బడ్జెట్ తగ్గించాలని అనుకున్నాను, నిర్మాతలకు అదనపు భారం ఉండకూడదని అనుకున్నాను.. ఇలా పలు కారణాలు చెప్తూ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని చెప్తూ తిరుగుతున్నారు ఆర్టిస్టులు. చాలామంది హీరో, హీరోయిన్లు కూడా ఇలాంటివి చాలాసార్లు చేశారు. మామూలుగా సినీ పరిశ్రమ అంటేనే కమర్షియల్ అని, రెమ్యునరేషన్ లేకుండా ఎవరూ ఏం చేయరని అంటుంటారు. కానీ కొందరు నటీనటులు మాత్రం అస్సలు రెమ్యునరేషన్ లేకుండానే సినిమాల్లో పనిచేశామని చెప్పుకుంటూ ఆ స్టేట్‌మెంట్‌ను ప్రమోషన్స్ కోసం వాడుకుంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరొకరు యాడ్ అయ్యారు.
ప్రమోషన్స్‌లో బిజీ
గత కొన్నేళ్లలో చాలామంది కామెడియన్స్.. హీరోలుగా మారారు. అందులో సప్తగిరి ఒకడు. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో ఒక్కసారిగా కమెడియన్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు సప్తగిరి. ఆ తర్వాత కమెడియన్‌గానే కొన్నేళ్ల పాటు తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. అదే సమయంలో కమెడియన్‌గా బ్రేక్ తీసుకొని హీరోగా మారాలని డిసైడ్ అయ్యాడు. అలా హీరోగా పలు సినిమాల్లో నటించినా సక్సెస్ రాలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. తాజాగా ‘పెళ్లి కాని ప్రసాద్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం బ్రహ్మాజీతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సప్తగిరి. అందులో తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింపథీ కోసమే
‘పెళ్లి కాని ప్రసాద్’ సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు తను ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేశానని రివీల్ చేశాడు సప్తగిరి. ఆ మాటను తాను నమ్మనని కొట్టిపారేశాడు బ్రహ్మాజీ. కావాలంటే నిర్మాతలను పిలిచి అడిగిస్తానని, తాను చెప్పేది నిజమని అన్నాడు సప్తగిరి. తాజాగా సప్తగిరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సింపథీ కొట్టేయడం కోసం ఈమధ్య చాలామంది సినీ సెలబ్రిటీలు ఇదే అబద్ధాన్ని వాడుకుంటున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఇలా మాట్లాడడమే ఫ్యాషన్ అయిపోయింది అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీని వల్ల తన సినిమాకు ప్రమోషన్స్ బాగా జరుగుతాయని సప్తగిరి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆశలెన్నో పెట్టుకున్న సీక్వెల్ ఇది.. కానీ, ఆ ఇద్దరి వల్ల ఆలస్యం..?
హిట్ కొట్టాల్సిందే
ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad) ట్రైలర్ విడుదలయ్యింది. సప్తగిరి (Sapthagiri) హీరోగా సినిమా అంటే ఏయే అంశాలు కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో.. అవన్నీ ఇందులో ఉన్నాయని ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అభిలాష్ రెడ్డి గోపిడి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు మురళీదర్ గౌడ్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతక కీలక పాత్రల్లో కనిపించారు. మార్చి 21న ‘పెళ్లి కాని ప్రసాద్’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు హీరోగా సప్తగిరికి సరైన హిట్ పడలేదు. అందుకే ఈ మూవీతో అయినా హిట్ కొట్టాలని దీనిపైనే ఆశలు పెట్టుకున్నాడు.