BigTV English

Sarangapani: బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా సారంగపాణి.. పాపం ప్రియదర్శి

Sarangapani: బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డా సారంగపాణి.. పాపం ప్రియదర్శి

Sarangapani: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కామెడీ చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమాలో ప్రియదర్శి, రూప కోడి వాయుర్ జంటగా నటించారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, నరేష్, హర్ష కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలలో విడుదలైన అన్నిచోట్ల మొదటి షో నుండి మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బోల్తా కొట్టినట్టు సమాచారం. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.


బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా..

సారంగపాణి జాతకం అంటూ ప్రియదర్శి థియేటర్లలోకి వచ్చారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలలో సారంగపాణి జాతకం, ఖింజనా రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ప్రస్తుతం పరవాలేదు అనిపించే రేంజిలో మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో కొనసాగుతున్నాయి. మొదటిరోజు యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కొంచెం ఓపెనింగ్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఈ సినిమా మొదటిరోజు ఉన్నంత ఓపెనింగ్స్ రెండో రోజు కనబరచలేదు. తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా.. వరల్డ్ వైడ్ గా 80 లక్షలు రేంజ్ గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. కానీ, ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదని సమాచారం.. అన్ని బాగుంటే వీకెండ్ లో ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. ఈ సినిమా బుక్ మై షోలో రేటింగ్ విషయంలో దారుణంగా పడిపోయింది. 7.7 రేటింగ్ తో బుక్ మై షో లో సినిమాకు ఇచ్చారు. సారంగపాణి జాతకం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందంటూ నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.


కథ విషయానికి వస్తే ..

కోర్టు సినిమా సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రియదర్శి, సారంగపాణి జాతకం బోల్తా పడడంతో అందరు పాపం ప్రియదర్శి అంటున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సారంగపాణి జాతకాలు ఎక్కువగా నమ్మే కుర్రాడు. ఏ పని చేయాలన్నా ముందు జాతకం చూస్తే కానీ పని మొదలుపెట్టడు. ఒక కారు షోరూంలో ఇతను సేల్స్ మెన్ గా వర్క్ చేస్తుంటాడు. అయితే అదే షోరూంలో హీరోయిన్ మైధిలి మేనేజర్ గా పనిచేస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కొంతకాలం తరువాత ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత వారి ప్రేమ విషయాన్ని పెద్దలతో చెప్తారు. వెంటనే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో సారంగపాణి లైఫ్ లోకి జిగ్నేశ్వర్ ఎంట్రీ ఇస్తాడు. అతను సారంగపాణి చెయ్యి చూసి లైఫ్ లో నువ్వు మర్డర్ చేయబోతున్నావు అని చెప్తాడు. హీరో లైఫ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంటుందని.. తను అసలు ఎవరిని మర్డర్ చేయబోతున్నాడు ఏంటి అని తెలుసుకోవాలంటే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే, ఇక ఈ సినిమా అనుకున్న టైం కి వచ్చి ఉంటే ఇంకాస్త సక్సెస్ అయ్యేదేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×