Sekhar Master:ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు శేఖర్ మాస్టర్. అయితే ఇలాంటి ఈయనకు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించే అవకాశం వస్తుండడంతో ఆ అదృష్టం నాకే దక్కింది అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా తండ్రీ కొడుకులు ఇద్దరితో పనిచేసే అదృష్టం లభించడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపారు శేఖర్ మాస్టర్. మరి ఆ తండ్రీ కొడుకులు ఎవరు? ఆయనకు దక్కిన అదృష్టం ఏంటో..? ఇప్పుడు చూద్దాం..
డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన తండ్రీకొడుకులు..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ డాన్స్ కారణంగానే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు కూడా. ఇక ఈయన తనయుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా డాన్స్ విషయంలో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు. ఇలా డాన్స్ లో అదరగొట్టే హీరోలకు కంపోజ్ చేయడం అంటే కొరియోగ్రాఫర్ కి చాలా కష్టమే. అలాంటిది చరణ్ , చిరంజీవి లకు డాన్స్ కొరియోగ్రఫీ చేయడం అంటే అదృష్టం అని భావిస్తున్నారు డాన్స్ మాస్టర్స్. విడివిడిగా అవకాశం వస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలాంటిది ఇద్దరికీ కలిపి డాన్స్ కంపోజింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక రాంచరణ్ , చిరంజీవి ఇప్పటివరకు మూడుసార్లు కలిసి డాన్స్ చేసి అభిమానులను మెప్పించారు. మొదట ‘మగధీర’ సినిమాలో ‘బంగారు కోడిపెట్ట’ పాటకి , ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో ‘అమ్మడు లెట్స్ కుమ్ముడు’ సాంగ్ కి ‘ఆచార్య’ సినిమాలో ‘బంజారా’ పాటకి వీరిద్దరూ కలిసి డాన్స్ చేశారు. అయితే ఇందులో రెండు పాటలకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేయడం గమనార్హం.
ఆ అదృష్టం నాకే దక్కిందంటున్న శేఖర్ మాస్టర్.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఏ కొరియోగ్రాఫర్ కి దక్కని అదృష్టం నాకు దక్కింది. చిరంజీవి, రామ్ చరణ్ లతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది ఇద్దరినీ కలిపి డాన్స్ చేయించే అవకాశం నాకు ఏకంగా రెండు సార్లు లభించింది. ఖైదీ నెంబర్ 150 సినిమాలో అమ్మడు లెట్స్ కుమ్ముడు పాటకి, అలాగే ఆచార్య సినిమాలో బంజారా సాంగ్ కి నేనే కంపోజ్ చేశాను. ఇక అమ్మడు లెట్స్ కుమ్ముడు పాటకి నాకు బాగా పేరు వచ్చింది అంటూ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తెలిపారు. శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఇదే స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు గుర్తింపు తగ్గ పేరును సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Maheshbabu: మహేష్ బాబు రూ.5.9 కోట్ల స్కాం… నేడే విచారణ… అరెస్ట్ కూడా…?