BigTV English

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్ 2025-26 లైవ్.. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్ 2025-26 లైవ్.. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

Union Budget 2025-26| పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రవేశపెట్టారు. తెలుగుకవి గురజాడ అప్పారావు పద్యంతో  ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రారంభించారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ సీతారామన్ గురజాడ కవిత్వాన్ని పలికారు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తుండగా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.


నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవడం మొదలుపెట్టగానే.. విపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అందుకు నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.

⦿ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న అధిక వృద్ధి సాధిస్తోన్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి.


⦿ ఇన్‌కం ట్యాక్స్‌లో అనవసర సెక్షన్లు తొలగింపు. వచ్చే వారంతో కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లు. లిటిగేషన్లు తగ్గించేలా ట్యాక్స్ విధానం. TDSపై మరింత స్పష్టత. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత పన్ను విధానం. అప్‌డేటెడ్ ఇన్‌ట్యాక్స్ నమోదుకు 4 ఏళ్లు గడువు.

⦿ సీనియర్ సిటిజెన్స్‌కు వచ్చే వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు. రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.

⦿ మధ్య తరగతి ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు. పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా. స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా. ఇతర పన్ను స్లాబుల్లో కూడా మార్పులు.

⦿ రూ.4 లక్షలు – రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను. రూ.8 లక్షలు – రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను. రూ.12 లక్షలు – రూ.16 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను.  రూ.16 లక్షలు – రూ.20 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను. రూ. 20 లక్షలు – రూ.24 లక్షల ఆదాయంపై 25 శాతం పన్ను. రూ. 24 లక్షలు ఆపైన ఆదాయంపై 30 శాతం పన్ను.

⦿ రైల్వే శాఖ లాభాల్లో ఉందన్న కేంద్ర ఆర్థిక మంత్రి

⦿పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం.

⦿ రైతులు, మహిళలు, పేద వర్గాలకే బడ్జెట్ లో ప్రాధాన్యం.

⦿ 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా లక్ష్యం.

⦿ భారత్ చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

⦿ గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి స్పూర్తిగా బడ్జెట్

⦿ త్వరిత సమ్మిళిత పెట్టుబడుల వృద్ధి లక్ష్యంగా భారత్ అడుగులు

⦿ ఇన్‌ఫ్రా, మధ్యతరగతి వికాసమే లక్ష్యంగా అయిదేళ్ల ప్రణాళిక.

⦿ పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.

⦿ కిసాన్ క్రెడిట్ రుణాల పరిమితి పెంపు. రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

⦿ ప్రయోగాత్మకంగా 100 జిల్లాలో పిఎం ధన్‌ధాన్య యోజన కొత్త పథకం ప్రారంభం.

⦿ ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం

⦿ బిహార్ లో  – మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు. – నేషనల్ ఫుడ్ ప్రాసెసెంగ్ టెక్నాలజీ బిహార్ లో స్థాపన. – బిహార్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. ఎన్నికలు జరుగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు.

⦿ లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియా పోస్ట్. పోస్టల్ శాఖకు కొత్త రూపురేఖలు

⦿ స్టార్టప్ కంపెనీలకు రూ.20 కోట్ల వరకు రుణం.

⦿ దేశంలో కొత్తగా మూడు యూరియా ప్లాంట్లు ఏర్పాటు

⦿ కార్మికులు అధికంగా పనిచేసే సంస్థలకు చేయూత

⦿ వీధి వ్యాపారులకు రూ.30 వేల రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు. పట్టణ పేదలు, వర్తకులకు ప్రాధాన్యం.

⦿ కోటి మంది గిగ్ వర్కర్లకు బీమా పథకం. ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు.

⦿ పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం. పత్తి ఉత్పాదకత కోసం ప్రత్యేక మిషన్.

⦿ సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు. ఎంఎస్‌ఎంఈ సంస్థలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు

⦿ అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ బ్యాండ్ సేవలు. 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్. పాఠశాలల్లో విద్యతోపాటు నైపుణ్య శిక్షణ.

⦿ ఐఐటి పట్నా విస్తరణ. విద్యారంగంలో ఏఐ వినియోగం.  పదేళ్లలో ఐఐటీ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు. అయిదేళ్లలో అదనంగా 75వేల మెడికల్ సీట్లు. 2014 తరువాత ఏర్పాటైన ఐఐటీలకు మరిన్ని నిధులు.

⦿ విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు. మూల ధన వ్యయాల కోసం రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు. నగరాలకు గ్రోత్ హబ్స్‌గా మార్చేందుకు నిధులు. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలు.

⦿ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. 2025-26లో 500 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు. 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్ను తొలగింపు. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు  కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు. కేన్సర్ బల్క్ డ్రగ్స్ తయారీకి పన్ను మినహాయింపు. సర్జికల్ పరికరాల ధరలు తగ్గింపు.

⦿ ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సహకాల కోసం క్లీన్ టెక్ మిషన్. తగ్గనున్న ఎలెక్ట్రిక్ వాహనాల ధరలు. లిథియంం బ్యాటరీలపై పన్ను తొలగింపు.

⦿  మరో 120 రూట్లలో ఉడాన్ పథకం.

⦿ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి. ప్రైవేట్ రంగం తోడ్పాటుతో పర్యటక రంగంలో ఉపాధి అవకాశాలు. పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు.

⦿ మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు.

⦿ ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం FDIలకు అనుమతి. ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అవకాశం.

⦿ అణుశక్తి చట్టానికి సవరణలు, ప్రైవేట్ సంస్థలకు అవకాశం

⦿ ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్ ఏర్పాటు

⦿ స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ క్రెడిట్ కార్డులు

⦿ పిఎం జన్ యోజన కింద ఆరోగ్య బీమా. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు.

⦿ తగ్గనున్న మొబైల్ ఫోన్, లెదర్ ఉత్పత్తుల ధరలు.

⦿ కస్టమ్స్ చట్టంలో భారీ మార్పులు. 7 రకాల సుంకాల తొలగింపు.

⦿ ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ ప్రసంగం 1 గంట 15 నిమిషాలపాటు సాగింది.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×