CM Revanth Reddy: పథకాల అమలులో నిజమైన లబ్దిదారులకు ఏ ఒక్కరికీ అన్యాయం జరగ కూడదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అనర్హులకు లబ్ది చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని కాసింత ఘాటుగా హెచ్చరించారు. నాలుగు పథకాలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ క్రమంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం.
ఆదివారం నుంచి నాలుగు పథకాలను అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎస్ శాంతికుమారి సహా ఇతర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత గ్రామ, వార్డుల సభల గురించి ఆరా తీశారు. వారి నుంచి సమాచారం తీసుకున్నారు.
పథకాల అమలులో ఎలాంటి లోటుపాట్లు జరగడానికి వీలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా నాలుగు అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. ఒక్కో పథకానికి ఒకొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించనున్నారు.
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రజలకు ఇవ్వనుంది. లబ్దిదారులకు కచ్చితంగా న్యాయం జరిగాలని, అలాగని అనర్హులకు లబ్ది చేస్తే సహించేది లేదన్నారు. లక్షల్లో దరఖాస్తులు రావడంతో జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలన్నారు.
ALSO READ: కిషన్ రెడ్డిజీ.. బీఆర్ఎస్ స్క్రిప్ట్ చదవద్దు.. ఎంపీ చామల సూచన