BigTV English
Advertisement

Kohli – Sachin: కోహ్లీ, సచిన్‌పై కేసు.. పెద్ద తలకాయలు అయినా.. వదిలేలా లేరు

Kohli – Sachin: కోహ్లీ, సచిన్‌పై కేసు.. పెద్ద తలకాయలు అయినా.. వదిలేలా లేరు

Kohli – Sachin: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసు రోజురోజుకీ సీరియస్ అవుతోంది. మొదటిగా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వారు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కొందరు అయితే కేసులు, కోర్టులకు భయపడి పరారయ్యారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌లో నిందితులుగా ఉన్న పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్స్ పరారీలో ఉన్నారు. ఇంతలోనే కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పోలీసులు ఫోకస్ పెడుతున్నారని, ఇందులో కొందరు పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్ల పేర్లు కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో యాడ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.


చిక్కుల్లో కింగ్ ఖాన్

ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. అవి లీగలా కాదా అన్న విషయం పక్కన పెడితే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయితే చాలు.. క్రికెటర్లు సైతం ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒకప్పుడు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పేర్లు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ తరపున ప్రకాశ్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ల పేర్లు బయటికి రావడంతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై వీరంతా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పుడు అదే లిస్ట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు కూడా యాడ్ అయ్యింది.


కోట్లలో రెమ్యునరేషన్

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారంటూ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌పైనే కాదు.. క్రికెటర్స్ అయిన సచిన్ (Sachin), విరాట్ కోహ్లీ (Virat Kohli)పై కూడా కేసులు నమోదు చేయాలంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ గ్రీన్ సొసైటీ నిర్ణయించుకుంది. మామూలుగా సెలబ్రిటీల రేంజ్‌ను బట్టి వారికి రెమ్యునరేషన్ ఇస్తుంటాయి ఈ బెట్టింగ్ యాప్స్. ఒకవేళ స్టార్ హీరోలు సింపుల్‌గా ఒక పోస్ట్ షేర్ చేసినా కూడా వారి రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. అలా బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లు సంపాదించిన వారిని వదిలేసి యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించనుంది ఈ గ్రీన్ సొసైటీ.

Also Read: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల మాస్టర్ ప్లాన్.. ఓనర్స్‌పై కేసు.. ఇక విట్నెస్‌లు వీళ్లే

చాలా తేడా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు ఉన్న ఫాలోయింగ్ బట్టి, యూట్యూబర్‌లో వారికి ఉన్న సబ్‌స్క్రైబర్లను బట్టి వారికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలని డిసైడ్ చేస్తాయి బెట్టింగ్ యాప్స్. అది కూడా ఒక పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తే ఒకలాగా, ఆ స్టోరీని రీషేర్ చేస్తే ఒకలాగా, దానికి ప్రత్యేకంగా రీల్ చేస్తే ఒకలాగా రెమ్యునరేషన్ ఉంటుంది. ఆ విధంగా చూస్తే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కంటే సినీ సెలబ్రిటీలకు వచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే ఈ విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను మాత్రమే టార్గెట్ చేయకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తే బాగుంటుందని గ్రీన్ సొసైటీ సభ్యులు మాత్రమే కాదు ఎందరో నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×