Shankar: ప్రతీ దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అంతే కాకుండా కొందరు దర్శకులు అయితే కొందరు లెజెండరీ నటీనటులకు సంబంధించిన బయోపిక్స్ తెరకెక్కించాలని కూడా కలలు కంటుంటారు. కానీ అన్నీ సెట్ అయ్యి వారు అనుకున్నట్టుగా జరిగి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సైతం తనకు ఒక లెజెండరీ యాక్టర్ బయోపిక్ తెరకెక్కించాలని ఉందంటూ ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శంకర్.. తన మనసులోని కోరికను బయటపెట్టారు.
డ్రీమ్ బయోపిక్
రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా విడుదల అయిన వెంటనే ‘ఇండియన్ 3’పై ఫోకస్ చేయాలి శంకర్. ఇప్పటికే ‘ఇండియన్ 3’ను పూర్తి చేయకుండా ‘గేమ్ ఛేంజర్’తో బిజీ అయ్యాడని, అందుకే ఈ మూవీని విడుదల అయ్యేలా చేయమని మేకర్స్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో శంకర్‌కు వేరే దారి లేదు. ‘ఇండియన్ 3’ను వెంటనే పూర్తి చేసి దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తన లక్ష్యంగా మారింది. దాని తర్వాత శంకర్‌కు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ‘వేల్ పరి’ అనే తమిళ వీరుడి జీవితగాధను సినిమాగా తెరకెక్కించడమే తన డ్రీమ్ అని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టాడు ఈ దర్శకుడు. తాజాగా తన డ్రీమ్ బయోపిక్ గురించి కూడా బయటపెట్టాడు.
Also Read: మేం ఏం చేయకుండానే సత్య బ్లాక్ బస్టర్… నేటి డైరెక్టర్లపై వర్మ సెటైరికల్ ట్వీట్
మార్కెట్ లేదు
‘‘నేను ఒక బయోపిక్ తెరకెక్కించాలని అనుకుంటే అది కచ్చితంగా రజినీకాంత్ (Rajinikanth) సార్ బయోపికే. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ విషయం అందరికీ తెలుసు’’ అని బయటపెట్టారు శంకర్. ఈ దర్శకుడి స్టేట్‌మెంట్ విన్న ఆడియన్స్.. ముందు ఒక హిట్ తీసి ఫామ్‌లోకి వస్తే అప్పుడు రజినీకాంత్ బయోపిక్ గురించి ఆలోచించవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు తన సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా లెవెల్ హిట్స్ అందుకున్న శంకర్ (Shankar).. ఇప్పుడు అసలు హిట్స్ లేక పూర్తిగా మార్కెట్‌ను కోల్పోయాడు. అలాంటి తనకు రజినీ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన ఎలా వచ్చిందో అంటూ ఆడియన్స్ సెటైర్లు వేస్తున్నారు.
మూడేళ్లుగా వెయిటింగ్
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ గత మూడేళ్లుగా ప్రొడక్షన్ దశలోనే ఉంది. కానీ ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యలో ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడం కోసం ఈ మూవీకి బ్రేక్ ఇచ్చారు శంకర్. ఆ గ్యాప్‌లో రామ్ చరణ్ కూడా మరొక సినిమాకు కమిట్ అవ్వలేదు. దీంతో కచ్చితంగా ఈ సినిమా ఇంకా లేదని, రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అంతలోనే సినిమా అంతా పూర్తయ్యిందంటూ సంక్రాంతికి రిలీజ్ అంటూ మెగా ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు మేకర్స్.