BigTV English

Shankar: ‘గేమ్ ఛేంజర్’ ఔట్‌పుట్‌తో సంతోషంగా లేను.. అదేంటి శంకర్ అంత మాట అనేశారు.?

Shankar: ‘గేమ్ ఛేంజర్’ ఔట్‌పుట్‌తో సంతోషంగా లేను.. అదేంటి శంకర్ అంత మాట అనేశారు.?

Shankar: ఒక సినిమా విడుదల అవ్వగానే.. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా దానిపై ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేసి వైరల్ అవ్వడం ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా హిట్ అయిన సినిమాలపై మేకర్సే నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఎన్నో పాన్ ఇండియా సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ కూడా అదే లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మెసేజ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శంకర్.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో కాస్త ఫామ్‌లోకి వచ్చాడు అనుకునేలోపు అసలు తాను తెరకెక్కించిన మూవీ తనకే నచ్చలేదు అంటూ కామెంట్స్ చేసి అందరికీ షాకిచ్చారు శంకర్.


సంతోషంగా లేను

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పటివరకు యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. ముఖ్యంగా ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ సినిమాకు అంత బడ్జెట్ అనవసరం అని చాలామంది ప్రేక్షకులు తమ రివ్యూ అందిస్తున్నారు. పైగా ఎన్నో అనవసరమైన సీన్స్ ఉన్నాయని కూడా ఉన్నాయని ఫీలవుతున్నారు. అయితే మూవీ విడుదలయిన తర్వాత తాను రివ్యూలు పట్టించుకోవడం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు శంకర్. ఇంతలోనే ఏమైందో కానీ.. ‘గేమ్ ఛేంజర్’ ఔట్‌పుట్ విషయంలో తాను సంతోషంగా లేనంటూ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చారు.


Also Read: కోలీవుడ్‌లో మరో ‘కేజీఎఫ్’.. హిట్ కాంబోతో రిస్క్ తీసుకోనున్న ధనుష్..

ట్రిమ్ చేశాం

‘‘టైమ్ సరిపోక ఎన్నో ముఖ్యమైన సీన్స్‌ను నేను కట్ చేయాల్సి వచ్చింది. అసలైతే ఒరిజినల్ ఫుటేజ్ 5 గంటల కంటే ఎక్కువగా ఉంది. కానీ సినిమాను తక్కువ రన్ టైమ్‌లో విడుదల చేయడం కోసం చాలావరకు ట్రిమ్ చేశాం’’ అని బయటపెట్టారు శంకర్. కానీ ‘గేమ్ ఛేంజర్’ చూసిన చాలామంది ప్రేక్షకులు ఎన్నో అనవసరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని తీసేసి ఆయన ముఖ్యం అనుకున్న సీన్స్‌ను యాడ్ చేసి ఉండొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ (Shankar).. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల మూవీకి మరింత నెగిటివిటీ పెరుగుతుందని ఫీలవుతున్నారు. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) యావరేజ్‌గా నిలిచే అవకాశాలు కూడా తక్కువే అని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదే ప్లస్

‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. కానీ కియారా క్యారెక్టర్‌కు అసలు ప్రాముఖ్యత లేదు. చరణ్, కియారా మధ్య ఒక లవ్ ఎపిసోడ్‌ను యాడ్ చేసినా అది యూత్‌ను కూడా కనీసం ఇంప్రెస్ చేయలేకపోయింది. ముఖ్యంగా ఈ మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే అందరినీ ఆకట్టుకుంది. అందులో తండ్రి పాత్రలో నటించిన రామ్ చరణ్.. తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పలు సీన్స్‌లో ఎమోషనల్ అయ్యేలా చేశాడు. ఇక తనకు జోడీగా నటించిన అంజలి సైతం తన నటనతో ఆకట్టుకుంది. ‘గేమ్ ఛేంజర్’లో అక్కడక్కడా మాత్రమే హై మూమెంట్స్ ఉన్నాయని ఆడియన్స్ భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×