BigTV English

Odela 2 : అరుంధతి, అమ్మోరు సినిమాలతోనే పోల్చారు… ఆ రిజల్ట్ వస్తుందా?

Odela 2 : అరుంధతి, అమ్మోరు సినిమాలతోనే పోల్చారు… ఆ రిజల్ట్ వస్తుందా?

Odela 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా యాక్టర్స్ లో తమన్నా ఒకరు. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అయితే తమన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం హ్యాపీ డేస్ అని చెప్పొచ్చు. హ్యాపీ డేస్ సినిమాలో మధు అనే పాత్రలో కనిపించింది తమన్నా. ఆ తర్వాత కాళిదాసు, రెడీ, నిన్న నేడు రేపు వంటి సినిమాలను చేసింది తమన్న. అయితే ఈ సినిమాలేవి అంతగా గుర్తింపును తీసుకొని రాలేదు. ఆ తర్వాత సిద్దార్థ్ తో జంటగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సినిమాలో కనిపించింది తమన్నా. ఈ సినిమాలో గీతా పాత్రలో కనిపించిన తమన్నకి మంచి మార్కులు పడ్డాయి. చాలామంది యూత్ ని ఆకట్టుకుంది తమన్నా. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది తమన్నా. తెలుగులో కూడా స్టార్ హీరోలు సరసన నటించింది.


బాహుబలి సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు

బాహుబలి సినిమా స్థాయి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చోబెట్టింది బాహుబలి. ఆ సినిమాలో తమన్నా కూడా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తమన్నాకు ఆ సినిమాతో గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమన్నా చేసిన సినిమాలేవి పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కొన్ని లేడీ ఒరింటెడ్ సినిమాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు తమన్నా ఓదెల -2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఇదివరకే విడుదలైన ఓదెల ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ అది థియేటర్లో విడుదల కాలేదు, ఓటిటిలో దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఓదెల -2 థియేటర్లో విడుదల చేస్తున్నారు.


అరుంధతి రేంజ్

తమన్నా నటించిన ఓదెల 2 సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు శర్వానంద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సినిమా గురించి శర్వా మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అద్భుతంగా నచ్చింది. అరుంధతి అమ్మోరు సినిమాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది అని నాకు నమ్మకం ఉంది తప్పకుండా మీరు థియేటర్లో ఈ సినిమాను చూడండి అంటూ మాట్లాడారు. అరుంధతి సినిమా ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అనుష్కని లేడీస్ సూపర్ స్టార్ చేసిన సినిమా అది. అలానే అమ్మోరు సినిమా గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ జోనర్లో సినిమాలు రావడం అనేది రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ గా తగ్గిపోయింది. ఈ సినిమా వర్కౌట్ అయితే ఇలాంటి సినిమాలను చేసే ప్రయత్నాలు మరికొంత దర్శకులు చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

Also Read : Kalyan Ram : దేవర ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ట్రోల్స్ పై కళ్యాణ్ రామ్ రియాక్షన్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×