BigTV English

Hyderabad News: రిజర్వాయర్‌లో కుప్పలు తెప్పలుగా చనిపోయిన కోళ్లు.. నీరు సురక్షితమేనా..?

Hyderabad News: రిజర్వాయర్‌లో కుప్పలు తెప్పలుగా చనిపోయిన కోళ్లు.. నీరు సురక్షితమేనా..?

Hyderabad News: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్ల్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. తెలంగాణలోనూ పలు జిల్లాల్లోనూ కోళ్లు చనిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లాలో అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు కనిపించటం ప్రస్తుతం అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. చచ్చిన కోళ్లు నీటిపై తేలుతూ కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. అయితే ఈ జలాశయం నుంచే హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటుగా.. దాదాపు 600 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. దీంతో నగరవాసులు, ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అయితే, రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లు తేలడంపై విచారణ చేపట్టారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు రిజర్వాయర్, చుట్టుపక్కల కోళ్ల ఫారాలను పరిశీలించి విచారణ చేపట్టారు. కాలుష్య కారణాన్ని గుర్తించేందుకు ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించారు. బర్డ్ ప్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అధికారులు తనిఖీలు చేప్టటారు. నీటి వినియోగానికి సురక్షితంగా ఉందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWSSB) నివేదిక ప్రకారం.. నీరు వినియోగానికి సురక్షితంగా ఉందని ప్రజలకు పేర్కొంది. పరిశోధన అనంతరం నీరు కఠినమైన ట్రిపుల్ క్లోరిన్ ట్రీట్‌మెంట్‌కు లోనవుతుందని, IS ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బోర్డు వివరించింది. అదనంగా, నీటి సరఫరాలో క్లోరిన్ స్థాయి 0.5 ppm ఉండేలా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


ఏపీలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (HPAI) కేసులు నమోదైన తర్వాత ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 11న జిల్లా కలెక్టర్లు పౌల్ట్రీ రైతులకు, ప్రజలకు నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. రాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు కఠినమైన పర్యవేక్షణ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే పౌల్ట్రీ వాహనాలను తనిఖీ చేసేందుకు తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 12న సూర్యాపేట జిల్లాలో చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద, వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అధికారులు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న పౌల్ట్రీ వాహనాలను వెనక్కి పంపించారు.

ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అనవసర పుకార్లను ఖండించారు. ‘బాధిత పౌల్ట్రీలన్నింటినీ రెడ్ జోన్‌లోకి తీసుకువచ్చారు. 10 కిలో మీటర్ల పరిధిలో ఉన్న చికెన్ దుకాణాలు మూసివేయించాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. వ్యాప్తిని నియంత్రించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టి) తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read: BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ‌లో జంతువులకు గుడ్లను, కోళ్లను తినిపించడాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గతంలో నెహ్రూ జూలాజికల్ పార్కులో పులులు, సింహాలు, కొండచిలువలు, జాగ్వర్‌లకు ప్రతిరోజూ 35 కిలోల చికెన్ మరియు 140 గుడ్లు తినిపస్తారు. అయితే, ప్రస్తుతం అధికారులు ముందు జాగ్రత్తగా కోడి గుడ్లు, కోళ్లను సరఫరా చేయడం నిలిపివేసి, మటన్, బీఫ్, ఫోర్క్ మాంసం అందజేస్తున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×