BigTV English

Chandrababu With Pawan: రాజ్యసభ సీటు.. నోటిఫికేషన్ వచ్చేసింది, ఏం చేద్దాం

Chandrababu With Pawan: రాజ్యసభ సీటు.. నోటిఫికేషన్ వచ్చేసింది, ఏం చేద్దాం

Chandrababu With Pawan: ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుకు నోటిఫికేషన్ ఇచ్చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 2028 జూన్ వరకు ఆయన పదవీకాలం ఉండగానే,  కొన్ని కారణాల వల్ల ఆయన రాజ్యసభ సీటు, వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది. మే 9న ఎన్నికల జరగనుంది. విపక్షానికి సీట్లు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరగనుంది.


రాజ్యసభ సీటు కోసం పోటీ

ఏపీలో రాజ్యసభ, మండలిలో ఒక్క సీటు ఖాళీ అయినా కూటమిలో నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. నార్మల్‌గా టీడీపీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు జనసేన, మరోవైపు బీజేపీ ఉండడంతో ఆశావహులు సంఖ్య  అమాంతంగా పెరిగింది. ఇటీవల వైసీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ సీటుకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేసింది.


ఇప్పటికే ఆశావహులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కలిసి తమకే ఇవ్వాలని రిక్వెస్టులు పెట్టుకున్నారు. నామినేషన్‌కు సమయం ఉండడంతో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు రేపో మాపో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

బీజేపీ పెద్దలు ఏమంటున్నారు?

విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మాంచి సంబంధాలు ఉండడంతో ఏం చెయ్యాలా అనే దానిపై టీడీపీ-జనసేనలు తర్జనభర్జన పడుతున్నాయి. సొంతంగా నిర్ణయం తీసుకుంటే లేనిపోని సమస్య వస్తాయని  భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీటు విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఒక్కసారి కలిసి మాట చెబితే వాళ్లు తమ నిర్ణయాన్ని చెబుతారని అంటున్నారు.

ALSO READ: వీఎస్ఆర్ స్థాయి కోసం బుగ్గన కుస్తీ.. ఎందుకు?

చంద్రబాబు-పవన్ కల్యాణ్ సమావేశం తర్వాత ఓ నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఢిల్లీ పెద్దలకు చెబితే బాగుంటుందని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. విజయసాయిరెడ్డి బీజేపీ వైపు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన కమలం గూటికి వెళ్తే ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసి, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిన విషయాన్ని  గుర్తు చేస్తున్నారు. అదికాకుండా బీజేపీ పెద్దలు ఎవరినైనా రాజ్యసభకు పంపాలని భావిస్తే.. ఆ సీటు వారికి ఇవ్వాల్సి వుంటుంది. ఎలా చూసినా సీటుపై బీజేపీ నుంచి నిర్ణయం రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ నుంచి రేసులో

బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు లేకుంటే అప్పుడు ఆ సీటును టీడీపీకి కేటాయించడం ఖాయమని అంటున్నారు. టీడీపీ నుంచి చాలామంది సీనియర్లు రాజ్యసభకు వెళ్లాలని తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ ఆర్థికమంత్రి, సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు పెద్దల సభకు వెళ్లాలని ఎప్పటినుంచో  భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత వద్ద పలుమార్లు ప్రస్తావించారు.

రాజ్యసభ సీటు కోసం ఉత్తరాంధ్ర నుంచి ఒకరు,  ఉభయగోదావరి జిల్లాల నుంచి మరొకరు, కృష్ణా-గుంటూరు జిల్లాల ఇద్దరు, రాయలసీమ నుంచి మరొకరు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వారంలో సీటు ఎవరికి అన్నది ఫైనల్ కానుందని అంటున్నారు. అప్పటివరకు సస్పెన్షన్ తప్పదని అంటున్నారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×