krithi shetty: ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే టక్కున కృతి శెట్టి పేరు చెప్పొచ్చు.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి, బుచ్చిబాబు డైరెక్షన్ లో, వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఉప్పెన.ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతుంది. తాజాగా ఈమె నటిస్తున్న తమిళ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వ్రాప్ అప్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అసలు ఆ వీడియోలో కృతి, ప్రదీప్ రంగనాథన్ తో ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్పీడ్ లో హీరో హీరోయిన్ ..
కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించారు. ఉప్పెన తర్వాత తెలుగు సినిమాలలో ఊహించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో అమ్మడు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లారు. తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. యూత్ ఫుల్ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కృతి శెట్టి ఈ సినిమా గురించి లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ మలేషియాలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఈరోజు లాస్ట్ డే షూటింగ్ లో అందరం పాల్గొన్నామని.. మూవీ టీం తో కలిసి చేసిన వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అప్పుడే కంప్లీట్ చేశారా.. హీరో, హీరోయిన్స్ సూపర్ స్పీడ్ లో వున్నారు అంటు కామెంట్స్ పెడుతున్నారు.
కృతిశెట్టికి లిక్ కలిసొస్తుందా.?
సినిమాల విషయానికి వస్తే.. కృతి శెట్టి, కార్తీ సరసన ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత రవి మోహన్ సరసన జెనీ అనే మరో తమిళ సినిమాతో మన ముందుకు రానున్నారు. తెలుగులో వరుసగా సినిమాలు చేసి బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, మనమే వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథ్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, యోగి బాబు, గౌరీ కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించనున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కృతిశెట్టికి లిక్ కలిసొస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాతో కృతి శెట్టి భారీ విజయాన్ని అందుకోవాలని, మరిన్ని తమిళ తెలుగు చిత్రాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం..