BigTV English

Shocking Video : థియేటర్ ని తగలబెట్టేసారు… బన్నీ ఫ్యాన్స్ ఇలానే ఉంటారా?

Shocking Video : థియేటర్ ని తగలబెట్టేసారు… బన్నీ ఫ్యాన్స్ ఇలానే ఉంటారా?

Shocking Video : మోస్ట్ అవైటింగ్ మూవీ ‘పుష్ప 2 (‘Pushpa 2) ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. థియేటర్లలో పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతూ, విజిల్స్ వేస్తూ… ఈలలు గోలలతో తెగ సందడి చేస్తున్నారు. అయితే ఆ అభిమానం హద్దు దాటితే ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికే ఇలా హద్దు దాటిన అభిమానం కారణంగా ఓ నిండు ప్రాణం బలయ్యింది. ఇక తాజాగా ఓ ప్రాంతంలో ‘పుష్ప 2’ థియేటర్ ను తగలబెడుతూ కనిపించారు అభిమానులు.


‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలుచోట్ల ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో ఆందోళనను కలిగించే వార్తలు బయటకు వస్తున్నాయి. ఓవైపు సినిమాకు సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. కానీ మరోవైపు ఈ మూవీ స్క్రీనింగ్ అవుతున్న కొన్ని థియేటర్లలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కలెక్షన్ పరంగా ఈ సినిమా మాస్ జాతర చూపిస్తుంటే మరోవైపు రోజుకో చిక్కు వచ్చి పడుతుంది మూవీ మేకర్స్ కి. అయినప్పటికీ అభిమానులలో నెలకొన్న ఉత్సాహం ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా చోట్ల అభిమానుల ఉత్సాహం హద్దు దాటి, సాధారణ ఆడియన్స్ కు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. తాజాగా ఓ థియేటర్లో ఏకంగా అల్లు అర్జున్ అభిమానుల ఉత్సాహం హద్దు దాటి, థియేటర్ ను తగలబెట్టేదాకా వెళ్ళింది.

సాధారణంగానే స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. దాన్ని చూపించడానికి చాలామంది థియేటర్లలో ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేస్తారు. మరి కొంతమంది డాన్సులు చేస్తూ తమ ఉత్సాహాన్ని చాటుకుంటారు. కానీ కొంతమంది మాత్రం అభిమానంతో పిచ్చిపిచ్చిగా చేస్తూ ఆడియన్స్ ను ఇబ్బంది పెడతారు. తాజాగా నల్గొండ జిల్లాలోని ఓ థియేటర్లో ఇలాగే అభిమానుల అత్యుత్సాహం థియేటర్లో మంటలు చెలరేగడానికి కారణమైంది. అయితే ఇది ఏ థియేటర్లో జరిగింది అన్న విషయం ఇంకా తెలియ రాలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు థియేటర్ లో మంటలు చెలరేగిన వీడియోలు ఫోటోలు చూస్తుంటే ఆడియన్స్ అందరూ సేఫ్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే థియేటర్ యజమానులకు మాత్రం ఇలాంటి పనుల వల్ల సమస్యలు తప్పవు.


ఇలాంటి హద్దు మీరిన చేష్టల వల్ల ఒకవైపు ప్రేక్షకులు, మరోవైపు థియేటర్ యాజమాన్యం భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన బాధాకర ఘటన సంచలనం రేపుతుంది. ఇలాంటి టైంలో నల్గొండ థియేటర్లో మంటలు చెలరేగడానికి అభిమానులు కారణం కావడంతో… అల్లు అర్జున్ అభిమానులు అంటే ఇలాగే ఉంటారా? వైల్డ్ ఫైర్ అంటే అర్థం ఇదేనా? అంటూ మండి పడుతున్నారు నెటిజన్లు. ఇక ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చాలా చోట్ల సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సెకండ్ డే దారుణంగా డ్రాపౌట్స్ కనిపిస్తున్నాయి. టికెట్ రేట్లు అందుకు కారణం అంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ తన అభిమానులను హద్దుల్లో ఉండమని ఒక్క మాట చెప్తే ఇలాంటి నష్టాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×