Shraddha Das: ఈమధ్య చాలావరకు హీరో, హీరోయిన్లు కేవలం యాక్టింగ్ వరకే పరిమితం అయిపోకుండా ఇతర రంగాల్లో కూడా ప్రయోగాలు చేస్తూ తమ సత్తా చాటుకోవాలని అనుకుంటున్నారు. అందుకే గత కొన్నేళ్లలో చాలామంది యాక్టర్స్.. నిర్మాతలుగా కూడా మారారు. నిర్మాణ రంగంలో చాలామంది సక్సెస్ అయ్యారు కూడా. ఇక తరువాత చాలామంది చూపు డైరెక్షన్‌పై పడింది. ఇప్పటికే కొందరు నటీనటులు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం మ్యూజిక్‌లో తన టాలెంట్ చూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌లో కూడా పాల్గొంది. దానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
సింగర్‌గా మారిన హీరోయిన్
ముంబాయ్‌లో పుట్టి, పెరిగిన శ్రద్ధా దాస్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసిందే టాలీవుడ్. చాలామంది ఇతర హీరోయిన్ల లాగానే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లిపోవచ్చని అనుకుంది శ్రద్ధా. కానీ తనకు తెలుగులో హీరోయిన్‌గా ఎన్ని అవకాశాలు వచ్చినా దానికి తగిన హిట్ మాత్రం దక్కలేదు. అందుకే తనకు బాలీవుడ్ నుండి ఆఫర్ రావడానికి చాలాకాలం పట్టింది. కానీ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ కూడా పెద్దగా హిట్ అవ్వకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌కే తిరిగి వచ్చేసింది శ్రద్ధా దాస్. హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గా సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా సింగర్‌గా మ్యూజిక్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యింది.
రీల్స్ నుండి స్టేజ్‌పైకి
సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్ అయ్యింది శ్రద్ధా దాస్. అందులో కేవలం తన ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. పాటలు కూడా పాడుతూ ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టింది. మెల్లగా ఇతర సింగర్స్ సాయంతో మ్యూజిక్‌లో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోషూట్స్‌కు మాత్రమే కాదు.. తన పాటలకు కూడా మంచి లూకులు రావడం మొదలయ్యింది. తను పాడుతూ షేర్ చేసిన రీల్స్‌కు యూత్ ఫిదా అయ్యారు. అందుకే శ్రద్ధా దాస్ కూడా తన మ్యూజిక్ టాలెంట్‌ను రీల్స్ నుండి స్టేజ్‌పైకి తీసుకెళ్లింది. తాజాగా ఒక కాన్సర్ట్‌లో పాడింది.
Also Read: రంభ రీఎంట్రీ కోసం భర్త కష్టాలు.. దర్శకులకు ఫోన్ చేసి మరీ..
గ్లామర్‌పైనే దృష్టి
తాజాగా ఒక భారీ కాన్సర్ట్‌లో పాట పాడింది శ్రద్ధా దాస్ (Shraddha Das). ‘రాఖీ’ సినిమాలోని టైటిల్ సాంగ్ పాడుతూ తెగ ఊగిపోయింది. దీంతో పాట కంటే ఊగడమే ఎక్కువయ్యింది అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. పాట బాగానే పాడింది కానీ దృష్టి మొత్తం తన గ్లామర్‌పైకి వెళ్లేలా చేసుకుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాట పాడుతూ.. మధ్యమధ్యలో స్టెప్పులేస్తూ బాగానే అలరించిందంటూ తన ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. శ్రద్ధా దాస్ చివరిగా ‘పారిజాత పర్వం’ అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం తన చేతిలో ‘అర్థం’ అనే మూవీ ఉన్నా ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">