POWERGRID Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవన్ సిస్టమ్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ విభాగాల్లో డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.
మహారాష్ట్రలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(POWERGRID) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 25న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: BIG BREAKING: గ్రూప్-2 ఫలితాలు విడుదల..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరి వారీగా పోస్టులు:
యూఆర్: 13 పోస్టులు
ఓబీసీ: 7 పోస్టులు
ఎస్సీ: 4 పోస్టులు
ఎస్టీ: 2 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 2 పోస్టులు
ఎక్స్ సర్వీస్ మెన్: 3 పోస్టులు
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 25
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టం ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 2025 మార్చి 25 నాటికి 29 ఏళ్ల వయస్సు మించి ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులక నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవ ప్రదమైన వేతనం కూడా లభిస్తుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులక నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 25
ALSO READ: ICAR Recruitment: డిగ్రీ అర్హతతో ICARలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. జీతమైతే రూ.60,000