BigTV English

Shraddha Kapoor: ఏకంగా 8 సినిమాలు.. అన్నీ ఒక్కరితోనే.. శ్రద్ధా కపూర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా.?

Shraddha Kapoor: ఏకంగా 8 సినిమాలు.. అన్నీ ఒక్కరితోనే.. శ్రద్ధా కపూర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా.?

Shraddha Kapoor: ఒక ప్రొడ్యూసర్‌కు లేదా డైరెక్టర్‌కు ఒక హీరోయిన్‌కు నచ్చిందంటే తనకే వరుసగా అవకాశాలు ఇస్తుంటారు. కానీ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాలు వచ్చిన తర్వాత వెంటనే వేరే హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెడతారు. కానీ ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ఏకంగా 8 సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయించుకుందట. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సినిమాలు తెలియగానే బీ టౌన్ ప్రేక్షకులు సైతం షాకవుతున్నారు. ఒకే మొహాన్ని అన్నిసార్లు చూస్తే బోర్ కొట్టేస్తుందని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన శ్రద్ధా.. ఇప్పుడు ఒకే ప్రొడక్షన్ హౌస్‌తో సినిమాలు చేయడంలో బిజీ కానుందని తెలుస్తోంది.


అన్నింటిలో ఒక్కరే

బాలీవుడ్ సెపరేట్‌గా ఒక హారర్ కామెడీ యూనివర్స్‌నే క్రియేట్ చేసింది. ఇప్పటికే ఆ యూనివర్స్ నుండి పలు సినిమాలు రాగా అన్నీ సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇక ఇందులో నుండి చివరిగా వచ్చిన ‘స్త్రీ 2’ అయితే ఏకంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో యాడ్ అయిపోయింది. అందుకే ఈ యూనివర్స్‌ను మరింత భారీగా మార్చాలని నిర్మాతగా దినేష్ విజన్ నిర్ణయించుకున్నాడు. మాడోక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి మరొక 8 సినిమాలు రాబోతున్నాయని ప్రకటించాడు. జనవరిలో బయటికొచ్చిన ఈ ప్రకటన చూసి ప్రేక్షకులు సైతం షాకయ్యారు. ఇప్పుడు ఈ సినిమాలు అన్నింటిలో శ్రద్ధా కపూరే హీరోయిన్ అని తెలిసి మరింత ఎక్కువగా షాకవుతున్నారు.


వరుసగా ఎనిమిది

ప్రతీ ఏడాది మాడోక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి ఏయే సినిమాలు వస్తున్నాయని ఈ నిర్మాణ సంస్థ స్పష్టంగా ప్రకటించింది. 2025లో దీపావళికి ‘థామా’, ‘శక్తి శాలిని’ విడుదల కానున్నాయి. ‘థామా’లో ఆయుష్మాన్ ఖుర్రానా, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026లో ఆగస్ట్ 14న ‘భేడియా 2’, డిసెంబర్ 4న ‘ఛాముండా’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2027లో ఆగస్ట్ 13న ‘స్త్రీ 3’, డిసెంబర్ 24న ‘మహా ముంజ్యా’ రిలీజ్ అవుతున్నాయి. 2028లో ఆగస్ట్ 11న ‘పెహ్లా మహాయుధ్’, అక్టోబర్ 18న ‘దూస్రా మహాయుధ్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఎనిమిది సినిమాల్లో శ్రద్ధా కపూర్ భాగం కానుందని తెలుస్తోంది.

Also Read: రిహార్సల్స్‌లో అంతా బాగానే ఉంది.. ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీపై ఊర్వశి రియాక్షన్

హీరోయిన్‌గా కాకపోయినా

ఇప్పటికీ మాడోక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో కేవలం ‘ముంజ్యా’లో మాత్రమే శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) లేదు. మిగిలిన మూడు సినిమాల్లోని రెండు సినిమాల్లో తనే హీరోయిన్‌గా నటించింది. మరొక చిత్రంలో కేవలం క్యామియో చేసింది. ఇక వరుసగా విడుదల కానున్న 8 సినిమాల్లో కూడా కొన్నింటిలో తను హీరోయిన్‌గా నటిస్తే కొన్నింటిలో గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే నిర్మాత దినేష్ విజన్ (Dinesh Vijan).. శ్రద్ధాను లక్కీ లేడీగా చూస్తున్నాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఇలాంటి సినిమాపైనే ఫోకస్ చేస్తే అందరికీ బోర్ కొట్టేసే అవకాశం కూడా ఉండొచ్చని సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×