BigTV English

Stree 2 film crosses Rs 400 cr mark : పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్న స్త్రీ

Stree 2 film crosses Rs 400 cr mark : పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్న స్త్రీ

Shraddha Kapoor’s Stree 2 film crosses Rs 400 cr mark.. likely to beat KGF 2’s Hindi record: ఎటువంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా.. భారీ సెట్టింగులు, భారీ బడ్జెట్ లేకుండా సైలెంట్ గా వచ్చి వైలెంట్ రికార్డులు బ్రేక్ చేస్తోంది స్త్రీ 2 మూవీ. సినిమా విడుదల కాకముందే అడ్వాన్సుల రూపంలో రూ.20 కోట్లు కొల్లగొట్టిన స్ల్రీ 2 మూవీ విడుదలయ్యాక తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే యశ్ నటించిన కెజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టిన స్త్రీ 2 మూవీ షారుఖ్, రజనీకాంత్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ రికార్డులు కూడా బద్దలయ్యేలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ సంవత్సరం బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. కేవలం హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి కంటెంటే హీరో.


తొలి సిరీస్ ను మించి..

స్త్రీ తొలి సిరీస్ మూవీ కన్నా రెండో సిరీస్ లో వచ్చిన ఈ మూవీకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా విడుదలై రెండు వారాలు అవుతున్నా అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏ వారానికి ఆ వారం థియేటర్ల సంఖ్య కూడా పెంచుకుంటూ పోతున్నారు నిర్మాతలు. ఏ హాల్ లో చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే సలార్ మూవీ కలెక్షన్లకు దగ్గరయింది స్త్రీ 2 మూవీ. సలార్ మూవీ నాలువందల ఆరు కోట్లు రాబట్టగా.. ఇప్పటికే నాలుగు వందల రెండు కోట్లు రాబట్టింది స్త్రీ మూవీ. ఈ వారాంతరానికి సలార్ రికార్డు బద్దలు కొట్టి.. ఐదు వందల కోట్ల రూపాయల మార్కుకు చేరుకోబోతోంది స్త్రీ 2 మూవీ. ఇక రజనీ కాంత్ నటించిన రోబో 2.0 కూడా 407 కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది.


Also Read: హీరో నిఖిల్ కొడుకును చూశారా.. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా

అగ్ర హీరోల రికార్డులు బద్దలు

ఈ వారాంతరానికి రజనీకాంత్ 2.0 రికార్డు కూడా బద్దలవబోతోంది. ఇక షారుక్ ఖాన్ పఠాన్, రణబీర్ కపూర్ యానిమల్ మూవీస్ రూ.500 కోట్ల వసూల్లు రాబట్టాయి. ఇప్పుడు స్త్రీ మూవీ ఆ రేంజ్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. సలార్, రోబో, పఠాన్, యానిమల్ లాంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. అయితే స్త్రీ 2 మాత్రం తక్కువ బడ్జెట్ తో రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అమర్ కౌశిక్ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. స్త్రీ 1 కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో రూ.180 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కూడా స్త్రీ 2 మూవీ బడ్జెట్ ఇంచుమించు రూ.20 కోట్ల లోపే. మరి ఈ మూవీ నాలుగు వందల కోట్లను రాబట్టే మూవీగా ఖరారయింది.

చరిత్ర సృష్టిస్తుందా?

నిజంగా రూ.500 కోట్ల మార్క్ ను దాటితే బాలీవుడ్ చరిత్రలోనే అమర్ కౌశిక్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటున్నారు సినీ మేధావులు. కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసిన సినిమా స్త్రీ 2. భారీ సెట్టింగుల జోలికి వెళ్లకుండా లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందించిన స్త్రీ 2 మూవీ తర్వాత ఇదే సిరీస్ లో మరిన్ని సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇన్నాళ్లూ స్టార్ హీరోలు నటిస్తేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే భ్రమలు ఈ మూవీతో తొలగిపోయాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×