Shreya Ghoshal: దర్శకులు, నిర్మాతలు, హీరో, హీరోయిన్లకు మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్‌కు కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా ఎన్నో ఏళ్లుగా పాటలు పాడుతూ, తన స్వరంతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సింగర్స్‌లో శ్రేయ ఘోషల్ కూడా ఒకరు. తన స్వరంతో మెలోడీ పాట మాత్రమే కాదు.. ఐటెమ్ పాట కూడా అద్భుతంగా వినిపిస్తుందని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి శ్రేయ ఘోషల్ సౌత్‌తో పాటు నార్త్ మాత్రమే కాదు.. దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో ఎన్నో వేల పాటలు పాడింది. అయితే ఐటెమ్ పాటలు పాడుతున్నప్పుడు తను ఏం ఫీల్ అవుతుంది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది.
తేడా ఉంది
ప్రతీ పాట సాహిత్యంలో అద్భుతంగా ఉన్నా కొన్ని పాటలు మాత్రం అసభ్యకరంగా కూడా ఉంటాయి. శ్రేయ ఘోషల్ కూడా తప్పక అలాంటి కొన్ని పాటలు పాడాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో తను పాడిన ‘చికినీ చమేలి’ (Chikni Chameli) పాట బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే అలాంటి పాటలు పాడడంపై శ్రేయ ఘోషల్ స్పందించింది. ‘‘నేను పడిన పాటల్లో కూడా కొన్ని అసభ్యకరమైన పాటలు ఉన్నాయి. అందులో చికినీ చమేలినే ఉదాహరణగా చెప్పొచ్చు. సెక్సీగా ఉండడానికి, నాతో పాటు అందరు ఆడవాళ్ల గురించి అసభ్యకరంగా మాట్లాడడానికి మధ్య చాలా చిన్న తేడా ఉంటుంది. ఒకప్పుడు దీని గురించి నేను ఆలోచించలేదు’’ అని చెప్పుకొచ్చింది శ్రేయా ఘోషల్.
ఇబ్బందిగా అనిపిస్తుంది
‘‘ఒకప్పుడు నేను పాడుతున్న అలాంటి పాటల గురించి నేను ఆలోచించలేదు. కానీ ఈరోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఆ లిరిక్స్‌కు అర్థమేంటో తెలియకుండా పాడుతుంటే ఆలోచించాల్సి వస్తోంది. అదొక ఫన్ సాంగ్. పిల్లలు దానికి డ్యాన్స్‌లు కూడా చేస్తున్నారు. కానీ ఎవరైనా పిల్లలు వచ్చి మీ ముందు నేను ఇది పాడొచ్చా అని అడిగినప్పుడు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. దాదాపు ఒక 5,6 ఏళ్లు ఉన్న అమ్మాయి లిరిక్స్ కూడా అర్థం కాకుండా ఈ పాడ పాడుతుందంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అది వాళ్లకు సెట్ అవ్వదు. చూడడానికి కూడా బాగుండదు. నాకు అదంతా వద్దు’’ అంటూ వాపోయింది శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal).
Also Read: వాళ్లకు దమ్ముంటే అలా చేయాలి.. బాలీవుడ్ మేకర్స్‌కు సందీప్ ఛాలెంజ్
ఆడవారు రాస్తే బాగుంటుంది
‘‘ఇప్పుడు నేను అలాంటి పాటల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా అలాంటి పాటలు పాడుతున్నప్పుడు అది సెలబ్రేట్ చేసుకునేలా, సెక్సీగా ఉన్నాను అన్నట్టు సంతోషంగా చెప్పుకునేలా ఉండాలి కానీ అసభ్యకరంగా మాత్రం ఉండకూడదు అని చెప్పేస్తున్నాను. ఒకవేళ ఆడవారు ఇలాంటి పాటలు రాసుంటే వేరేలాగా ఉండేదేమో. ఇది చూసే విధానంలోనే ఉంటుంది. మన సమాజంలో, ముఖ్యంగా ఇండియాలో సినిమాలు, పాటలు అనేవి ప్రేక్షకులపై అత్యంత ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటికి ఒక బెంచ్‌మార్క్ అనేది పెట్టడం ఎంతైనా ముఖ్యం’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది శ్రేయా ఘోషల్.