Sandeep Reddy Vanga: కొందరు దర్శకులు.. నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు. దానివల్ల తమ కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందా అనే విషయం ఆలోచించరు. అందులో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. తెలుగులో దర్శకుడిగా ఎంటర్ అయినప్పటి నుండి సందీప్ స్టైల్‌కు చాలామంది యూత్ ఫిదా అయ్యారు. అది తన సినిమా మేకింగ్ స్టైల్ గురించే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఎవరినీ కేర్ చేయని తన యాటిట్యూడ్ అందరికీ నచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అవకాశాలు ఇవ్వొద్దు
‘కబీర్’ సింగ్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత ‘యానిమల్’తో పూర్తిగా తన టాలెంట్ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. తాజాగా ‘యానిమల్’ (Animal) సినిమాలో నటించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.. వేరే సినిమాలో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే ‘యానిమల్’లో నటించినందుకు తనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని సందీప్‌కు ఫోన్ చేసి చెప్పాడట. అది విన్న తనకు బాగా కోపం వచ్చిందని చెప్పుకొచ్చాడు సందీప్. ‘‘మళ్లీ వెళ్లి సందీప్ మళ్లీ రణబీర్‌తో సినిమా చేస్తున్నాడని వాళ్లకు చెప్పు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor), తృప్తి దిమ్రీ, రష్మిక మందనాను వాళ్ల సినిమాలో తీసుకోవద్దని చెప్పు. విశాల్ మిశ్రా కూడా సినిమాలో ఒక పాట పాడాడు కదా.. తనకు కూడా అవకాశం ఇవ్వొద్దని చెప్పు’’ అంటూ సీరియస్ అయ్యాడు.
అవతార్ తీయట్లేదు
‘‘మీకు దమ్ముంటే ఇక్కడ మాట్లాడండి. ఇలా చేస్తేనే చాలా చిరాకుగా ఉంటుంది. అసలు ఇది విన్న తర్వాత నాకు ఎలా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆ అబ్బాయి ఎక్కడి నుండో వచ్చాడు. యానిమల్‌లో చిన్న పాత్ర చేశాడు, గుర్తింపు వచ్చింది. అందుకే ఇంకా ముందుకు వెళ్లాలి అనుకున్నాడు. ఆడిషన్ ఇచ్చాడు. కానీ నువ్వు యానిమల్‌లో నటించావు అందుకే మా కంపెనీ నీకు పని ఇవ్వదు అంటే ఏంటి అర్థం. వాళ్ల కంపెనీ అవతార్ సినిమా ఏం చేయట్లేదు. లైట్ తీసుకో అని ఆ అబ్బాయితో చెప్పేశాను’’ అంటూ జరిగిన విషయాన్ని వివరించాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అంతే కాకుండా ‘యానిమల్’ క్రెడిట్ అంతా రణబీర్ ఖాతాలో పడడంపై కూడా తను స్పందించాడు.
Also Read: సెన్సార్ సమస్యల్లో తృప్తి మూవీ.. అంత ఘాటు సీన్స్ ఉన్నాయా?
అసూయగా లేదు
‘‘యానిమల్ సినిమాను అందరూ తిట్టారు. కానీ రణబీర్ కపూర్‌ను మాత్రం పొగిడారు. నాకు తనంటే అసూయ ఏమీ లేదు. కానీ ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే డైరెక్టర్లను తిడుతూ యాక్టర్లను పొగడడం కామన్ అయిపోయింది. రణబీర్‌ను పొగిడినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. యానిమల్ వల్ల తనకు ప్రేమ దక్కింది. నాకు ద్వేషం దక్కింది. రణబీర్‌తో కలిసి పనిచేయాలని అనుకునేవారు తనను ఏమీ అనలేరు. హీరో అనేవాడు అయిదు సినిమాలు తీసే సమయంలో దర్శకుడు ఒక్క సినిమానే తీయగలడు. తనతో కలిసి పనిచేయాలి కాబట్టి తనను ఏమీ అనరు. నేను ఇక్కడ కొత్త కాబట్టి నన్నే టార్గెట్ చేశారు’’ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.