BigTV English

Retro : రెట్రో సినిమాలో స్టార్ హీరోయిన్ డాన్స్ సాంగ్

Retro : రెట్రో సినిమాలో స్టార్ హీరోయిన్ డాన్స్ సాంగ్

Retro : కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా చాలామందికి అభిమాన హీరో సూర్య. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు సూర్యకి లభించింది. చాలామందికి కొన్ని రోజులు ముందు వరకు కూడా సూర్య తమిళ నటుడు అని తెలియదు. అంతగా తెలుగు ప్రేక్షకులలో కలిసిపోయాడు. రీసెంట్ టైమ్స్ లో సూర్య చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ అందుకోలేక పోతుంది. సూర్య ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే చూడాలి అని ఆయన అభిమానులతో పాటు చాలామంది ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య సినిమాను రెట్రో చేస్తున్న సంగతి తెలిసిందే.


ఆశలన్నీ రెట్రో పైనే

పిజ్జా సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ సుబ్బరాజు. దానికంటే ముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి మంచి గుర్తింపును సాధించాడు. ఇప్పటికీ కార్తీక్ సుబ్బరాజ్ సినిమా టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తన ఫిలిం మేకింగ్ తో చాలామందిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఇక మొదటిసారి తన కెరీర్లో సూర్య హీరోగా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఒక ప్రాపర్ లవ్ స్టోరీ అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. సూర్య సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో సూర్య కం బ్యాక్ ఇస్తాడు అని చెప్పొచ్చు. కార్తీక్ సుబ్బరాజుకి సూర్య కూడా ఫేవరెట్ హీరో. ఇదివరకే రజినీకాంత్ కు పెట్ట వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కార్తీక్ ఇప్పుడు సూర్యకి అదే స్థాయి హిట్ ఇస్తాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు.


డాన్స్ నెంబర్

ఇకపోతే ఈ సినిమాలో శ్రీయా ఒక డాన్స్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీయ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎంతోమంది స్టార్ హీరోలు సరసన శ్రియ నటించింది. మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలతో మాత్రమే కాకుండా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది. అయితే రిట్రో సినిమాలో శ్రియా చేసే సాంగ్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. వాస్తవానికి ఇది ఐటమ్ సాంగ్ కాకపోయినా కూడా కంప్లీట్ డాన్స్ మెటీరియల్ సాంగ్ అని కార్తీక్ సుబ్బరాజ్ రీసెంట్గా ఒక తమిళ్ ఫిలిమ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Also Read : Pooja Hegde : నాకు 30 మిలియన్లు ఫాలోవర్స్ ఉండొచ్చు, బట్ అది రియల్ వరల్డ్ కాదు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×