BigTV English

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Shruti Haasan: ఒక హీరో లేదా హీరోయిన్ ఒక సినిమా పూర్తిచేసి అది ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక హీరో, హీరోయిన్‌తో మొదలయిన సినిమా.. పలు కారణాల వల్ల లేట్ అవ్వడం, వాయిదా పడడం కూడా జరుగుతుంటుంది. ఇటీవల అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా నుండి శృతి హాసన్ (Shruti Haasan) తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్.. నిజంగానే తాను ‘డెకాయిట్’ నుండి తప్పుకుందా? దానికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఓపెన్‌గా బయటపెట్టింది. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమని తేల్చేసింది.


అనుకోని సర్‌ప్రైజ్

అడవి శేష్ (Adivi Sesh) సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలానే క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌తో అదిరిపోయే థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించడంలో అడవి శేష్ దిట్ట అనే గుర్తింపు కూడా ఉంది. అందుకే అడవి శేష్ అప్‌కమింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ‘గూఢచారి 2’తో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడేమో అని ప్రేక్షకులు అనుకుంటున్న సమయంలోనే.. ఎవరూ ఊహించని విధంగా ‘డెకాయిట్’ గ్లింప్స్‌ను విడుదల చేశాడు. ఆ గ్లింప్స్‌తో హీరోయిన్ శృతి హాసనే అనే క్లారిటీ వచ్చేసింది. దీంతో అడవి శేష్, శృతి హాసన్ కాంబినేషన్‌ను స్క్రీన్‌పై చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుండగా శృతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.


Also Read: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

భారీ నష్టం

శృతి హాసన్, అడవి శేష్ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ‘డెకాయిట్’ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవ్వడానికి వీరి పెయిర్ కూడా కారణమయ్యింది. కానీ ఇప్పుడు శృతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడం అడవి శేష్‌కు పెద్ద నష్టమే మిగల్చనుంది. దీనిపై ఆడియన్స్‌లో హైప్ పోయే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఇప్పటికే ‘డెకాయిట్’కు సంబంధించిన షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది. అందులో చాలావరకు శృతి హాసన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తను తప్పుకోవడంతో ఆ సీన్స్ అన్నీ మరో హీరోయిన్‌తో షూట్ చేయాల్సి ఉంటుంది. అది నిర్మాతలకు కూడా భారీ నష్టమే. అయితే షెడ్యూల్స్ ఇష్యూ వల్లే ‘డెకాయిట్’ నుండి తప్పుకున్నానని తాజాగా క్లారిటీ ఇచ్చింది శృతి.

ఎవరు వస్తారో

శృతి హాసన్ పూర్తిగా సినిమాల్లోనే కాకుండా మ్యూజిక్ వీడియోలతో కూడా బిజీగా గడిపేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా శృతి కాల్ షీట్స్ ఎప్పుడూ పెద్దగా ఖాళీ ఉండవు. అలా అడవి శేష్ ‘డెకాయిట్’ షూటింగ్ విషయంలో షెడ్యూల్స్ దగ్గర తేడాలు జరిగి తను ఏకంగా సినిమా నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని శృతి ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అడవి శేష్, శృతి హాసన్‌ను కలిసి స్క్రీన్‌పై చూడొచ్చని అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉండగా ‘డెకాయిట్’లో శృతి హాసన్ స్థానంలోకి రానున్న హీరోయిన్ ఎవరు అనే ఆసక్తి కూడా మరికొందరు ప్రేక్షకుల్లో ఉంది.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×