BigTV English

Siddharth: అమ్మాయిలను కొట్టే పాత్రలు నేను చేయను.. వారిపై సిద్ధార్థ్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్

Siddharth: అమ్మాయిలను కొట్టే పాత్రలు నేను చేయను.. వారిపై సిద్ధార్థ్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్

Siddharth: తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాల్లో హీరోగా నటించి అందరినీ సీనియర్ కేటగిరిలో చేరిపోయాడు సిద్ధార్థ్. ఒకప్పుడు ప్రేక్షకులకు లవర్ బాయ్ అంటే సిద్ధార్థే. అలాంటి తన కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సినిమాలను వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల క్రితమే సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో సిద్ధార్థ్ చాలా మారిపోయాడు. కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాలను ఎంచుకునే హీరోలపై ఇన్‌డైరెక్ట్ కౌంటర్లు వేశాడు సిద్ధు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కావాలనే చేయలేదు

తాజాగా తన భార్య అదితి రావు తల్లి విద్యా రావుతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సిద్ధార్థ్. ఇందులో సినిమాల గురించి, లిటరేచర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే సినిమాల్లో చూపించే మగతనం అనే అంశం గురించి కూడా చర్చించుకున్నారు. అయితే తాను ఇప్పటివరకు కావాలనే అలాంటి పాత్రలు చేయాలేదని బయటపెట్టాడు సిద్దార్థ్. కమర్షియల్ సినిమా హీరో అనిపించుకోవడం కోసం తాను ఎప్పటికీ అలా చేయను అని చెప్పేశాడు. తనకు అలాంటి అవకాశాలు వచ్చినా చేయలేదని, తనకు అలాంటి గుర్తింపు తెచ్చుకోవడం ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్.


రిజెక్ట్ చేసేశాను

‘‘అమ్మాయిలను కొట్టడం, ఐటెమ్ సాంగ్స్ చేయడం, వారి నడుమును గిల్లడం, ఒక అమ్మాయికి ఏం చేయాలో చెప్పడం, ఎక్కడికి వెళ్లాలో చెప్పడం.. ఇలాంటి కథలు నా దగ్గరకు చాలానే వచ్చాయి. నేను వాటిని అప్పటికప్పుడు రిజెక్ట్ చేశాను. నేను అలాంటివి చేసుంటే ఇంతకంటే పెద్ద స్టార్ అయ్యిండేవాడిని. కానీ నేను నాకు నచ్చింది మాత్రమే చేసుకుంటూ వెళ్లాను. ఈరోజు ప్రేక్షకులు నేను అమ్మాయిలతో గౌరవంగా ఉంటానని, తల్లిదండ్రులతో మంచిగా ఉంటానని, పిల్లలతో మంచిగా ఉంటానని, క్యూట్‌గా ఉంటానని చెప్తుంటారు. వాళ్ల పిల్లలు కూడా నేను 15 ఏళ్ల క్రితం చేసిన సినిమాలు చూడగలరు. అదే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్ (Siddharth).

Also Read: తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై హింట్.?

ఏడవడానికి వెనకాడను

‘‘ఈ ఫీలింగ్‌ను కోట్లతో లెక్క కట్టలేను. నా చుట్టూ ఉన్న హీరోలంతా మాచోగా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంటారు. చాలామంది అబ్బాయిలకు అసలు బాధ ఉండదు అన్నట్టుగా కనిపిస్తుంటే నేను మాత్రం స్క్రీన్‌పై ఏడవడానికి కూడా వెనకాడను’’ అంటూ వేరే హీరోలతో తనను తాను పోల్చుకుంటూ వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్. అంటే ఈరోజుల్లో కమర్షియల్ సినిమాలు చేసే హీరోలపై తను ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. తన దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో నిజంగానే కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నాడు. వర్సటైల్ యాక్టర్‌గా, లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అప్పటి యూత్‌కు మాత్రమే కాదు.. ఇప్పటి యూత్‌కు కూడా నచ్చే సినిమాలు చేశాడు. అలా సిద్ధార్థ్‌కు ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×