Dhruv Jurel – Gambhir: టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో… భారత అభిమానులకు ఛేదు అనుభవం ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా.. మూడవ మ్యాచ్ లో కూడా గెలిచే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుతుందని చెప్పవచ్చు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాదాపు 200కు పైగా ఇంగ్లాండ్ స్కోర్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇంగ్లీష్ ప్లేయర్లను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు.
Alsp Read: Ind vs Eng, 3rd T20I: చేతులెత్తేసిన బ్యాటర్లు.. రాజ్‌కోట్ లో టీమిండియా ఓటమి..!
కానీ టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి… కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏకంగా 26 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. అయితే ఈ ఓటమికి కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) చెత్త నిర్ణయాలు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో టీమిండియా కు తీవ్ర నష్టం వాటిల్లిందని… గౌతమ్ గంభీర్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఆరో వికెట్ కు రావలసిన టీమిండియా బ్యాటర్ ధృవ్ జురెల్ ( Dhruv Jurel )… ను ఎనిమిదో వికెట్ కు పంపించారు గౌతమ్ గంభీర్.
ఈ నిర్ణయం వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ సూచన మేరకు…. ఎనిమిదవ వికెట్ కు ధృవ్ జురెల్ ( Dhruv Jurel ) ను సూర్యకుమార్ యాదవ్ పంపించినట్లు సమాచారం అందుతుంది. అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్ ను ( Washington Sunder) మాత్రం… ఆరవ వికెట్ కు పంపించడం జరిగింది. దాంతో 15 బంతులు ఆడిన వాషింగ్టన్ సుందరం కేవలం ఆరు పరుగులు చేసే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా… వికెట్ కోల్పోయాడు. ఇక ఎనిమిదవ వికెట్ కు వచ్చిన కొత్త బ్యాటర్ ధృవ్ జురెల్ ( Dhruv Jurel )… నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. వాస్తవానికి ఆ సమయంలో ఆస్కింగ్ రేట్ ఎక్కువగా ఉంది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది. మరొక ఎండ్ లో సరైన బ్యాటర్ లేడు.
Also Read: Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?
దీంతో ధృవ్ జురెల్ ( Dhruv Jurel ) కూడా వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి… ఆరో వికెట్ కు ధృవ్ జురెల్ ( Dhruv Jurel )ను పంపిస్తే… ఫలితం వేరే లాగా ఉండేది. ఇదే విషయాన్ని ఇప్పుడు ఫ్యాన్స్ చెబుతున్నారు. గౌతమ్ గంభీర్ ను ( Gautam Gambhir ) టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అనవసరపు చెత్త నిర్ణయాల వల్ల గెలవాల్సిన టీమిండియా ఓడిపోయిందని మండిపడుతున్నారు. ఇక మరో రెండు టీ20లో.. టీమిండియా మళ్లీ గాడిలో పడడం… కష్టమే అంటున్నారు. ఒక్కసారి ఇంగ్లాండు కు ఛాన్స్ ఇస్తే వాళ్ళు రెచ్చిపోతారని గుర్తు చేస్తున్నారు. ఇక అటు నిన్నటి మ్యాచ్ లో కూడా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అట్టర్ ఫ్లాఫ్.. కావడం జరిగింది. సంజు కూడా ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ యువరాజు లాగా చివరి వరకు ఆడ లేకపోతున్నాడు.
🚨 WHAT A BLUNDER 🚨
Sent Washington Sundar at No. 6, he scored 6 in 15 balls while chasing 172, whereas you were playing Dhruv Jurel as a pure batter and sent him at No. 8, when you had already lost the match. 🤦🏻♂️ pic.twitter.com/MqiBEUYivK
— Vishal. (@SPORTYVISHAL) January 28, 2025