BigTV English

Vaishnavi: No.1 ఖతర్నాక్, చీరలో చూసి మోసపోకండి.. వైష్ణవిపై సిద్దు కామెంట్స్.. వీడియో వైరల్

Vaishnavi: No.1 ఖతర్నాక్, చీరలో చూసి మోసపోకండి.. వైష్ణవిపై సిద్దు కామెంట్స్.. వీడియో వైరల్

Vaishnavi: స్టార్ బాయ్ సిద్దు హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం జాక్. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్దు నుంచి రాబోతున్న సినిమా జాక్. బేబీ సినిమాతో సక్సెస్ ని అందుకున్న అందాల భామ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో సిద్దుతో జతకట్టనుంది. వేసవి కానుకగా ఈ చిత్రం రానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ పతాకం పై బీ.వీ.ఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డైనమిక్ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ హాజరయ్యారు. ఈ వేడుకలో సిద్దు, వైష్ణవి చైతన్య గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..


https://www.bigtvlive.com/entertainment/ntr-prashant-neel-and-sukumar-attends-vamsi-paidipalli-wifes-birthday-celebrations.html

వైష్ణవిపై సిద్దు కామెంట్స్..


జాక్ సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘ టిల్లు స్క్వేర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని నేను చాలా గందరగోళంలో ఉన్నాను. ఆ సినిమా రెండు భాగాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ నా మీద బాధ్యతను పెంచేసింది. తర్వాత ఎంచుకునే ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నప్పుడు నా దగ్గరికి ఈ కథ వచ్చింది. కథ విన్న వెంటనే నాకు నచ్చేసింది. కొత్త జానెర్ లో సినిమా ట్రై చేయాలనుకున్నాను. అన్ని సినిమాలు ఒకేలా ఉన్నాయి అని ప్రేక్షకుల నుంచి మాట రాకూడదని, ఈ సినిమాని ఎంచుకున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అలా అయింది అంటే ఆ క్రెడిట్ అంతా, నిర్మాత ప్రసాద్ గారికే దక్కుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో మల్టిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. వారందరికీ కూడా చాలా థాంక్స్. ఇక హీరోయిన్ వైష్ణవి గురించి చెప్పాలంటే బేబీ సినిమా చూసిన తర్వాత, జాక్ లో హీరోయిన్ గా వైష్ణవి చేయాలి అని మేము ఫిక్స్ అయ్యాము. అందరూ ఈమె ఎలా చేస్తుందో యూట్యూబ్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కువ అనుభవం లేదు అని అన్నారు. కానీ వైష్ణవి టాలెంటెడ్ అన్నది నేను బేబీ సినిమాలోనే చూశాను. చాలా టాలెంటెడ్ పర్సన్, ఈ సినిమా కోసం కష్టపడ్డారు. చాలా బాగా నటించింది. నటనే కాదు చాలా అందంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా చీరలో చాలా బావుంటుంది అని సిద్దు వైష్ణవి వైపు చూస్తూ మీ కంటి లోని పుట్టుమచ్చ మీకు అద్దం ముందు నుంచుంటే ఎలా కనిపిస్తుందో అలాగే మీలో ఉన్న టాలెంట్ మీకు కనిపించదు అందరికీ కనిపిస్తుంది. ఈ సినిమాతో అది మీరు ప్రూవ్ చేసుకుంటారు’ అని అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.bigtvlive.com/entertainment/sai-abhyankar-in-bunny-atlees-movie.html

 

థియేటర్ లో కలుద్దాం అన్న సిద్దు..

దర్శకుడు భాస్కర్ ఆరంజ్ సినిమా నుంచి నాకు తెలుసు. ఆయన తీసే ప్రతి సినిమాలో హీరో డిఫరెంట్ గా కనిపిస్తాడు. టిల్లు సినిమాని ఎంత బాగా ఆదరించారో అందులో వినోదం మిమ్మల్ని ఎంత నవ్వించిందో, ఆ ఇమేజ్ ని తగ్గకుండా ఈ సినిమా తీశాడు దర్శకుడు భాస్కర్ అని, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, మీరంతా థియేటర్స్ కి వెళ్లి చూసి సినిమాని సక్సెస్ చేయాలని, సిద్దు జొన్నలగడ్డ ఈవెంట్ లో అభిమానులను కోరారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సక్సెస్ మీద ఉన్న సిద్దుకి ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది. అని అభిమానులతో పాటు మనము కోరుకుందాం..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×