BigTV English
Advertisement

Simran: ఆంటీ పాత్రలు చేయడం తప్పేం కాదు.. నటిపై సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్

Simran: ఆంటీ పాత్రలు చేయడం తప్పేం కాదు.. నటిపై సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్

Simran: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్స్‌గా నటించిన వారంతా ఇప్పుడు అదే హీరోలకు తల్లి పాత్రలు చేయాల్సి వస్తోంది. అలా చేయడం చాలామందికి నచ్చకపోయినా కొందరు మాత్రం ఇండస్ట్రీలో ఉండాలంటే అలాంటివి చేయక తప్పదు అంటూ కాంప్రమైజ్ అయిపోతున్నారు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు సైతం వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారు కాబట్టి వారి సరసన సీనియర్ హీరోయిన్స్ సరిగ్గా సెట్ అయిపోతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్లు ఆంటీ పాత్రలు చేయడంపై సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేరొక హీరోయిన్ పేరును ప్రస్తావిస్తూ సిమ్రాన్.. ఆంటీ పాత్రలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.


ఓపెన్ కామెంట్స్

ఒకప్పుడు సిమ్రాన్ అంటే కుర్రకారుకు క్రష్. గ్లామర్ విషయంలోనే కాదు.. యాక్టింగ్ విషయంలో కూడా తనను తానే పోటీ అన్నట్టుగా ఉండేది. తెలుగు, హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా పెద్ద పెద్ద స్టార్‌లతో నటించి తాను కూడా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. తను స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే తల్లి పాత్రలు చేయడానికి వెనకాడలేదు సిమ్రాన్. అందుకే ఇప్పుడు కూడా తల్లి పాత్రలు చేయడానికి వెనకాడడం లేదు. కొందరు నటీమణులు మాత్రం ఆంటీ పాత్రలు అనగానే వెనక్కి తగ్గుతారని, అలా చేయడం కరెక్ట్ కాదని.. తాజాగా ఒక నటి తనతో చేసిన కామెంట్స్ గురించి ఓపెన్‌గా స్టేజ్‌పైనే చెప్పేసింది సిమ్రాన్.


అస్సలు ఊహించలేదు

తాజాగా ఒక అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న సిమ్రాన్ (Simran).. తన నటనకు స్పెషల్ అవార్డ్ కూడా అందుకుంది. ఆ అవార్డ్ తీసుకున్న తర్వాత తను ఒక ఆసక్తికర సందర్భాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘ఇటీవల నేను నా కో యాక్టర్ ఒక నటికి మెసేజ్ చేశాను. తను ఒక సినిమాలో చేసిన పాత్ర చూసి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను అని చెప్పాను. కనీసం ఇది ఆంటీ పాత్రలకంటే చాలా బెటర్ అంటూ తను రిప్లై ఇచ్చింది. అసలు తను ఆలోచన లేకుండా అలాంటి స్టేట్‌మెంట్ ఇస్తుందని నేను ఊహించలేదు. అది తన అభిప్రాయమే అయ్యిండొచ్చు. కానీ దానికంటే తను మంచి రిప్లై ఇచ్చి ఉండవచ్చని నాకు అనిపించింది’’ అని తన సహ నటితో జరిగిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది సిమ్రాన్.

Also Read: పెళ్లి కాకుండానే తల్లి అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

అదే బెటర్

‘‘డబ్బా పాత్రలు చేయడం కంటే ఏమీ చేయకుండా ఉండడం కంటే ఆంటీ పాత్రలు, ముఖ్యమైన ఆంటీ పాత్రలు చేయడం, 25 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకు తల్లిగా నటించడం అనేది చాలా బెటర్ అని నేను అనుకుంటున్నారు. కన్నతిల్ ముత్తమిట్టాల్ సినిమాలో నేను తల్లి పాత్రలోనే కనిపించాను. మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనేదాని గురించి మనం ముందు కాన్ఫిడెంట్‌గా ఉండాలి’’ అంటూ నటీమణులకు మోటివేషన్ అందించింది సిమ్రాన్. ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్ల సరసన నటించిన సిమ్రాన్.. ప్రస్తుతం తల్లి పాత్రలు చేసినా అందులో కూడా తనకంటూ ఒక ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటోంది. చివరిగా ‘రాకెట్రీ’ సినిమాలో సిమ్రాన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×