kalpana suicide attempt : టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో వినిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన ఇంట్లో స్పృహ తప్పి పడిపోయారు. అది గమనించిన అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి స్పృహలో లేని కల్పనను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆమె అలా పడి ఉండటానికి కారణం ఏంటో తెలియకుండానే సూసైడ్ చేసుకుందని వార్తలు వినిపించాయి. భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందని భావించారు. మరికొందరు కూతురు ఆమెమాట వినకపొవడం వల్ల సూసైడ్ కు ప్రయత్నించిందని అందరు భావించారు. కానీ సింగర్ కల్పన తాజాగా.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె తన సూసైడ్ కు క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కల్పన సూసైడ్ పై పోలీస్ కేసు నమోదు..
సింగర్ కల్పన సూసైడ్ చేసుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసుకున్నారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అని అనేక కోణాల్లో విచారణ జరిపారు పోలీసులు.. ఈ క్రమంలో తన కూతురితో గొడవలు ఉన్నాయని వార్తలు వినిపించగా అటుగా కూడా విచారణ జరిగిన పోలీసులు తన కూతురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చింది. అంత బాగానే ఉన్నాం మా అమ్మ డోస్ ఎక్కువ అవ్వడం వల్లే స్పృహ తప్పి పడిపోయింది అని తన కూతురు క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ఈ వార్తలు ఆగడం లేదు భర్త వేధింపులే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ వార్తలు పై స్పందించిన కల్పన ఒక వీడియోను రిలీజ్ చేసింది.. ఆ వీడియోలో కల్పన ఏమందో ఒకసారి చూద్దాం..
Also Read : రాజమౌళి మూవీలో మహేష్ పాత్ర పేరు ఇదే..? థియేటర్లు దద్దరిల్లాల్సిందే…
సూసైడ్ పై వీడియోతో కల్పన క్లారిటీ..
సింగర్ కల్పన సైతం తాను సూసైడ్ కు యత్నించిలేదని చెప్పారు. కేవలం తన కూతురుతో వచ్చిన కొన్ని మనస్పర్థల వల్ల మాత్రమే నిద్ర మాత్రలు మింగానని అన్నారు. అయితే.. డోస్ ఎక్కువగా కావడం వల్ల అపస్మారకస్థితిలోకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్ బీ పోలీసులు ఇప్పటికే ప్రెస్ నోట్ ను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను ఏ సూసైడ్ చేసుకోలేదు. కేవలం నాకు స్పేస్ ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆకుందులో భాగంగా ఇచ్చిన టాబ్లెట్స్ వల్లే నాకు డోస్ ఎక్కువైంది అలా స్పృహ తప్పి పడిపోయాను మా హస్బెండ్ కి నాకు ఎటువంటి గొడవలు లేవు. నేను ఇప్పుడు లాయర్ గా చదువుతున్నాను మా హస్బెండ్ వల్లే నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నారు అలాగే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ కూడా నేను పెట్టుకున్నాను నాకు మా హస్బెండ్ కి ఎటువంటి గొడవలు లేవు అలాగే నా కూతురుతో కూడా ఎటువంటి గొడవలు లేవు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలోనే మీ ముందుకు వచ్చి నేను మిమ్మల్ని సంతోషి పెట్టేలా పాటలు పాడుతానని హామీ ఇస్తున్న అని ఆ వీడియోలో కల్పనా అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సింగర్ కల్పన సంచలన వీడియో..
స్ట్రెస్ వల్లే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను
నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు
నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త , కూతురు
నా మీద జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు
రైట్ టైంలో ఆయన పోలీసులను అలర్ట్ చేశారు కాబట్టే నేను… pic.twitter.com/IWdAlTgdZb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025