Deepti Jivanji: తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ( Revanth Reddy Government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడాల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ప్రభుత్వం… జాతీయ క్రీడల్లో రాణించే వారికి… సరైన ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఇప్పటికే టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ( Mohammed Siraj ) ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారా ఒలింపిక్స్ 2024 ( Paralympics 2024 )సంవత్సరంలో జరిగిన పోటీల్లో…కాంస్య పతక విజేత దీప్తి జీవన్‌జీకి( Deepti Jivanji ).. బంపర్ ఆఫర్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: Varun Chakaravarthy: టెన్నిస్ బాల్ ప్లేయర్ నుంచి టీమిండియా వరకు… వరుణ్ సక్సెస్ వెనుక ఆ హీరో ?
ఆమెకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబోతున్నట్లు.. వెల్లడించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సమావేశంలో… పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా… కాశ్య పథక విజేత దీప్తి జీవన్‌జీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలపడం జరిగింది.
కాంస్య పతకం విజేత దీప్తి జీవన్‌జీకి( Deepti Jivanji )..గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సాయం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినందుకు గానూ గతంలోనే.. తన ఇంటికి పిలిపించుకుని.. సత్కరించారు. అనంతరం ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర సర్కార్ తరఫున అందించారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ). గతంలో క్రీడాకారులకు ఇలాంటి ప్రోత్సాహాకాలు ఎప్పుడూ ఎవరూ చూడలేదు.
Also Read: Rahul Chahar Tattoo: రాహుల్ చాహర్ చేతిపై SRH టాటూ… దేవుడు ఇలా ఫిక్స్ చేసాడు ?
కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంస్య పతకం విజేత దీప్తి జీవన్‌జీకి ప్రభుత్వ కొలువు ఇస్తామని ప్రకటించారు.. కానీ.. ఏ పదవి అనేది క్లారిటీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి సర్కార్. గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చే ఛాన్సు ఉందని అంటున్నారు. మహమ్మద్ సిరాజ్ కు ( Mohammed Siraj ) ఇప్పటికే డీఎస్పీ పదవి ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అటు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీసు శాఖలో DSP ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా క్రీడాల్లో రాణిస్తున్న వారికీ.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకమైన ప్రోత్సాహాకాలు ఇస్తోంది. ఇది చూసిన యువత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు దీప్తి జీవన్‌జీకి తెలంగాణ సర్కార్… ఉద్యోగం ఇవ్వడంపై ఆమె కుటుంబ సభ్యులు తెగ సంబర పడిపోతున్నారు.