Jayam Ravi – Arti:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జయం రవి (Jayam Ravi) అలియాస్ రవి మోహన్ (Ravi Mohan) పదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. తన భార్య ఆర్తి (Arti) నుండి కోర్టులో విడాకులు కోరిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తోంది. అటు రవి పై ఆయన భార్య ఆర్తి తో పాటు అత్తగారు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కేసు కోర్టులో వుండగా.. మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenisha Francis) కి – జయం రవి మధ్య రిలేషన్ ఉందని, ఆమె వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి స్వయంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్స్ తో పాటూ ఇప్పుడు హత్యా బెదిరింపులు కూడా ఎక్కువ అయ్యాయట.ఈ విషయాన్ని స్వయంగా కెనీషా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
సింగర్ కెనీషాకి హత్యా బెదిరింపులు..
తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కెనీషా స్పందిస్తూ.. కొందరు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాటి స్క్రీన్ షాట్ లు కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సాధారణంగా నేను ఏ విషయాన్ని కూడా దాచుకోను.. నన్ను ప్రశ్నించే హక్కు మీ అందరికీ ఉంది. కాబట్టి దానికి నేను రెడీగా ఉన్నాను. నా చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలపై కొంత మంది ఇలా చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను చేయని తప్పుకు నన్ను ఇలా నిందించడం కరెక్ట్ కాదు. మీకు నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తే నన్ను కోర్టు ముందు హాజరు పెట్టండి. అక్కడే నేను నిరూపించుకుంటాను. అంతేకానీ ఇలా నాపై శాపనార్థాలు పెడుతూ కామెంట్లు ఎందుకు చేస్తున్నారు. మీ వల్ల నేను మనోవేదన అనుభవిస్తున్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. త్వరలోనే నిజా నిజాలు కూడా బయటకి వస్తాయి. అప్పటివరకు నేనేం చేయలేను. తప్పు చేస్తే చట్టానికి కట్టుబడి, శిక్ష కూడా అనుభవిస్తాను. అంతే తప్ప పారిపోయే వ్యక్తిని కాద. అప్పటివరకు నిందించకండి. ఒకవేళ నేను తప్పు చేశానని కోర్ట్ కూడా నిర్ధారిస్తే అప్పుడు నన్ను నిందించండి” అంటూ కెనీషా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం కెనీషా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
కెనీషా వల్లే జయం రవి – ఆర్తి మధ్య విభేదాలా..?
ఇకపోతే జయం రవి తరచూ వెకేషన్ కోసం గోవా వెళ్తుండేవారని, అక్కడే సింగర్ కెనీషా పబ్ లో పాటలు పాడేదని.. అలా జయం రవికి పరిచయమైందని, ఇప్పుడు ఆమె వల్లే తనకు అన్యాయం చేస్తున్నాడు అంటూ ఆర్తి తన ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి తోడు జయం రవి, సింగర్ కెనీషా ఈమధ్య చట్టపట్టలేసుకొని తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఒక పెళ్లి వేడుకలో కూడా వీరిద్దరూ కలిసి సందడి చేశారు. దీంతో రూమర్లు మరింత ఎక్కువవుతున్నాయి. మరి దీనిపై జయం రవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:Manchu Manoj: ఫ్యామిలీ కోసం మనోజ్ ఆరాటం.. దానికోసమే పోరాడుతున్నా అంటూ ఎమోషనల్..