Mangli Controversy: ప్రసిద్ధ ఫోక్ సింగర్ మంగ్లీ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆమె బర్త్‌డే పార్టీకి సంబంధించి, పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, అక్కడ విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయని కేసు నమోదైందని ప్రచారం సాగుతోంది. ఇది మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారింది. అయితే మంగ్లీ ఈ ఆరోపణలను ఖండిస్తూ బుధవారం రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె తన వాదనను వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తప్పు ఒప్పుకుంటా..
మంగ్లీ చెప్పిన దానిప్రకారం, తన బర్త్‌డే పార్టీ అనేది పూర్తిగా కుటుంబ సమావేశం తరహాలో జరిగిన వేడుక. తల్లిదండ్రుల కోరిక మేరకు, తాము బంధువులు, స్నేహితులతో కలిసి ఒక రిసార్ట్‌లో చిన్న పార్టీ ప్లాన్ చేశామనీ, అది పెద్ద ఫంక్షన్ కాదని ఆమె చెప్పారు. అయితే రిసార్ట్‌లో సౌండ్ సిస్టమ్, మద్యం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె ఒప్పుకోవడం విశేషం. కానీ, ఆ ఏర్పాట్లకు అవసరమైన అనుమతుల విషయంపై తనకు అవగాహన లేదని చెప్పారు.
నాకు తెలియదు..
లిక్కర్, సౌండ్ సిస్టమ్ వాడటానికి అనుమతి కావాలని తనకు తెలియదని, తెలిసుంటే తప్పకుండా తీసుకునే దానిని అంటూ మంగ్లీ అన్నారు. నిజంగా తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప, ఇతర మత్తుపదార్థాలు అక్కడ లేవన్నారు. గంజాయి లాంటి పదార్థాలకు తాను పూర్తిగా వ్యతిరేకిని అని మంగ్లీ వివరించారు.
ఏమి దొరకలేదు
ఇంకా ఆమె చెప్పినదాని ప్రకారం, పార్టీ జరిగిన తర్వాత పోలీసులు రిసార్ట్‌లో తనిఖీ చేసినా ఎలాంటి నిషేధిత పదార్థాలు దొరకలేదని తెలిపారు. పోలీసుల వివరణ ప్రకారం, ఒక వ్యక్తి గంజాయి తాగినట్టు ఎరికా పాజిటివ్ వచ్చింది కానీ అతను రిసార్ట్‌కు రాకముందే ఎక్కడో వాడినట్టు తేలిందని ఆమె పేర్కొన్నారు.
Also Read: Bullet Train India 2025: జపాన్ ట్రైన్ ఎందుకు? ఇండియా బుల్లెట్ రైలు దూసుకొస్తోంది.. సిద్ధమేనా?
ఇదే చర్చ.. ఇదే రచ్చ
ఈ మొత్తం వ్యవహారం మంగ్లీ అభిమానులు, సంగీతాభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కొంతమంది ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ మాత్రం మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, తనపై ఆధారాల లేని ఆరోపణలు మోపవద్దని కోరారు. తాను ఓ మహిళగా, కళాకారిగా, రోల్ మోడల్‌గా నిలవాలనుకుంటున్నానని, మా అమ్మా నాన్నలతో ఉండి ఇలాంటివి ప్రోత్సహిస్తానా? అని ఆమె గళమెత్తారు.
బర్త్ డే పార్టీలో గంజాయి!
సింగర్ మంగ్లీ ఫస్ట్ రియాక్షన్ #SingerMangli #Tollywood #Singer #Mangli #BirthdayParty #BIGTVCinema pic.twitter.com/ZUsSfLWp1I— BIG TV Cinema (@BigtvCinema) June 11, 2025
సపోర్ట్ కంటే.. నెగిటివ్ ఎక్కువే!
ఈ కేసు మరింతగా ఆసక్తికరంగా మారిన విషయం ఏమిటంటే, పార్టీకి ముందే అనుమతుల విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగాయా? పార్టీలో నిబంధనలకు విరుద్దంగా ఇంకా ఏదైనా సాగిందా? అనే కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పలువురు నెటిజన్లు, మీడియా వర్గాలు ఈ కేసుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మీడియా చానెళ్లు ఆధారాల్లేని కథనాలను ప్రసారం చేస్తున్నాయని మంగ్లీ వీడియో ద్వారా చెప్పారు.
మొత్తానికి మంగ్లీ ఇచ్చిన వివరణ ఏమో కానీ, ఆమెపై వచ్చిన ఆరోపణలు మాత్రం రాకెట్ కంటే వేగంగా ప్రజల్లోకి వెళ్లాయని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చిన వివరణతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.