Big Tv Live Originals: దేశంలో ప్రతి రోజుల లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా జర్నీ కొనసాగిస్తారు. దేశ వ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉండటం, ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ప్రయాణీకులు రైలు టికెట్ల బుకింగ్ కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఏజెంట్ల ద్వారా టికెట్లు ఎలా బుక్ చేస్తారు? ఈ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఏజెంట్ల ద్వారా టికెట్ బుకింగ్ ఎలా?
భారతీయ రైల్వే అధికారిక భాగస్వామి IRCTC ద్వారా కొంత మంది ఏజెట్లు అనుమతి తీసుకుంటారు. అనుమతి పొందిన ఏజెంట్ల ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయవచ్చు. IRCTC అధికారిక ఏజెంట్లుగా రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు లేదంటే సంస్థలు రైల్వే టికెట్ బుకింగ్ సేవలను అందిస్తాయి.
ఏజెంట్ నెట్ వర్క్ ఎలా పని చేస్తుంది?
IRCTC.. టికెట్ బుకింగ్ ఏజెంట్లకు ప్రత్యేక లాగిన్ ID, పాస్ వర్డ్ అందిస్తుంది. దీని ద్వారా వాళ్లు IRCTC వెబ్ సైట్, యాప్ లో టికెట్లను బుక్ చేయవచ్చు. MakeMyTrip, Paytm, RailYatri లాంటి ప్లాట్ ఫామ్ లు కూడా IRCTCతో ఒప్పందం చేసుకుంటాయి. ఇవి కూడా టికెట్ బుకింగ్ సేవలను అందిస్తాయి. ఏజెంట్లు వినియోగదారుల నుంచి వివరాలు సేకరించి, వారి అకౌంట్ ద్వారా టికెట్లను బుక్ చేస్తారు.
ఏజెంట్లు ఎలా లాభం పొందుతారు?
IRCTC ఏజెంట్లకు ప్రతి టికెట్ బుకింగ్ మీద కమీషన్ అందిస్తుంది. అదనంగా, ఏజెంట్లు తమ సర్వీస్ ఛార్జీలను కూడా వసూలు చేస్తారు. సాధారణంగా టికెట్ ధరపై అదనంగా kp. 20 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఈ రెండు పద్దతుల ద్వారా లాభం పొందుతారు.
ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్ తో కలిగే లాభాలా
ఏజెంట్లు తత్కాల్ టికెట్లను వేగంగా బుక్ చేస్తారు. ముఖ్యంగా బిజీ సీజన్లలోనూ కచ్చితంగా టికెట్లు బుక్ చేస్తారు. టెక్నాలజీ గురించి తక్కువ తెలిసిన వారికి ఏజెంట్లు సులభంగా టికెట్లు బుక్ చేసి ఇస్తారు. సమయం ఆదా చేయడంలో ఎంతగానో ఉపయోగపడతారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కొంత మంది అనధికారికంగా ఏజెంట్లుగా చలామని అవుతారు. అధికారం లేని ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అందుకే, IRCTC రిజిస్టర్డ్ ఏజెంట్లను మాత్రమే ఎంచుకోవాలి. టికెట్ బుకింగ్ తర్వాత PNR స్టేటస్ ను తనిఖీ చేయడం, టికెట్ చెల్లుబాటును నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.
నేరుగా టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం!
నిజానికి రైలు టికెట్లను ఏజెంట్ల కంటే, సొంతంగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ఉత్తమం. ఎంతో భద్రత కూడా. అయితే, సరైన ఏజెంట్ ను ఎంచుకుంటే.. ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో వాళ్లు కచ్చితంగా టికెట్లు బుక్ చేస్తారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: మరిన్ని రైళ్లు, చౌకగా విమానాలు, కాశ్మీర్ లోయ నుంచి పర్యాటకుల తరలింపు!