Health: సౌండ్ హీలింగ్ థెరపీ అనేది ఒక పురాతన చికిత్సా పద్ధతి. ఈ థెరపీలో మ్యూజిక్, గంటలు, రాగి పాత్రలు, మంత్రాలు లేదా ప్రకృతి శబ్దాల వంటి వివిధ ధ్వనులను ఉపయోగిస్తారు. ఈ శబ్దాలు మన శరీరంలోని కణాలను ప్రభావితం చేస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
సౌండ్ హీలింగ్ ఎలా పనిచేస్తుంది?
మన శరీరం ఒక శక్తి క్షేత్రంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన లేదా అనారోగ్యం వల్ల ఈ శక్తి సమతుల్యత కోల్పోతుందట. సౌండ్ హీలింగ్ థెరపీలో ఉపయోగించే శబ్ద తరంగాలు శరీరంలోని శక్తి కేంద్రాలను సమన్వయం చేస్తాయి. ఈ శబ్దాలు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి వాటిలో కూడా ఇది సహాయపడుతుందట.
టిబెటన్ సింగింగ్ బౌల్స్ లేదా గాంగ్స్ నుండి వచ్చే శబ్దాలు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తాయట. ఈ ఫ్రీక్వెన్సీ మన మెదడు తరంగాలను ప్రభావితం చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది. ఈ స్థితిలో, మనసు ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుందట. నెమ్మదిగా శరీరం రిలాక్స్ అవుతుందట.
సైంటిఫికల్ ఫ్రూఫ్..!
సౌండ్ హీలింగ్ థెరపీ అనేది ఒత్తిడిని తగ్గించగలదా అనేదానిపై సైంటిఫికల్ గా ఆధారాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శబ్ద తరంగాలు శరీరంలోని కణాలను కంపించేలా చేస్తాయట, ఇది సెల్యులార్ స్థాయిలో ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్‌ని తగ్గించేందుకు సౌండ్ థెరపీ సహాయపడుతుందట. అంతేకాకుండా హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆందోళన, నిద్రలేమి, దీర్ఘకాలిక నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని సైన్స్ చెబుతోంది.
ALSO READ: కంటి కురుపు ఎందుకు వస్తుంది?
సౌండ్ హీలింగ్ థెరపీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందట. ఒత్తిడితో బాధపడే వారు, నిద్ర సమస్యలు ఉన్నవారు, లేదా శారీరక నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారు ఈ థెరపీ ద్వారా మంచి ఫలితాన్ని పొందే వీలు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులకు కూడా సురక్షితమైనది.
ఎలా ప్రారంభించాలి?
సౌండ్ హీలింగ్ థెరపీలో శబ్దాలను వినడం ద్వారా లోతైన రిలాక్సేషన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కూడా, సంగీతం లేదా ప్రకృతి శబ్దాలను వినడం ద్వారా ఈ థెరపీని ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.