Singer Sunitha: ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి, అందులో కొందరు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఒక జూనియర్ బ్యాక్‌గ్రౌండ్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఫేమ్ సంపాదించుకుంటున్న ప్రవస్తి అనే సింగర్.. కీరవాణి, సునీత లాంటి మ్యూజిక్ లెజెండ్స్‌పై చేసిన ఆరోపణల దగ్గరే ఇదంతా మొదలయ్యింది. దీంతో అప్పటినుండి అసలు ఈ సింగర్స్ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, వారి పర్సనల్ లైఫ్ ఏంటి అని ప్రేక్షకులు తెలుసుకోవడంపై ఫోకస్ పెరిగింది. తాజాగా సింగర్ సునీతకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ కాగా.. అందులో సింగర్ ఉషా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సునీత.
ఈపాటికి చచ్చిపోవాలి
మామూలుగా సింగర్స్ అంతా ఆన్ స్క్రీన్ సాన్నిహిత్యంగానే కనిపిస్తారు. బుల్లితెరపై కూడా అంతా చాలా క్లోజ్‌గా ఉంటారు. కానీ నిజంగా వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది, ఎలాంటి అనుబంధం ఉంది అనే విషయాలు పెద్దగా బయటికి రావు. కానీ సింగర్ సునీత, ఉషా మధ్య ఎప్పటినుండో విభేదాలు ఉన్నాయని మాత్రం మ్యూజిక్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దానిపై సునీత ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ‘‘ఉషాతో నేను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు నాతో ఎందుకో కావాలనే సరిగ్గా మాట్లాడరు అనిపిస్తుంటుంది. వాళ్లు నాకంటే ఎక్కువ పాటలు పాడేశారు అనే ఈర్ష్య ఉండుంటే నేను ఈపాటికి చచ్చిపోవాలి’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది సునీత.
వేరేవాళ్ల ద్వారా తెలిసింది
‘‘ఉషా (Usha) నాతో ఎప్పుడూ సౌకర్యంగా లేదు. నేను ఏదో సందర్భంలో ఏదో అన్నానని అనుకొని ఉషా ఫీల్ అయ్యింది అని నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. నేను ఏమన్నానో తను ఏమనుకుందో నాకేం తెలియదు. నాతో ఏమైనా సమస్య ఉంటే నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి. వేరేవాళ్లతో చెప్పకూడదు. నన్ను అపార్థం చేసుకున్న వాళ్ల లిస్ట్ చాలానే ఉందని నాకు ఈమధ్యే అర్థమయ్యింది. ఉదయభాను కూడా నేను తనను ఒక షోకు ఆహ్వానించి అవమానించానని చెప్పింది. ఏదో విషయంలో నేను అసూయపడ్డానని అంది. తను అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిందంటే తను అసూయగా ఫీలయ్యిందని అర్థం. మనం తెలియకుండానే చాలా జరిగిపోతూ ఉంటాయి’’ అని చెప్పుకొచ్చింది సునీత.
Also Read: సునీతాతో గొడవ.. నా గురించి ఆమె అలా అంది.. సింగర్ ఉషా షాకింగ్ కామెంట్స్
నేను అలా కాదు
ఇండస్ట్రీలో తనను చూసి ఈర్ష్య పడేవాళ్లు చాలామందే ఉన్నారని చెప్పకనే చెప్పింది సునీత (Sunitha). తనకు మాత్రం అలాంటివి ఏమీ ఉండవని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో తను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సింగర్ సునీతతో గొడవ గురించి ఉషా సైతం స్పందించింది. అసలు తనకు, సునీతకు ఎప్పుడూ ఎలాంటి గొడవ రాలేదని, వాళ్లు ఎప్పుడూ సన్నిహితంగానే ఉండేవాళ్లని చెప్పుకొచ్చింది. కానీ సునీత.. ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్‌మెంట్ వల్లే తనకు బాధ కలిగిందని వాపోయింది. మొత్తానికి హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల మధ్యే కాదు.. సింగర్స్ మధ్య కూడా కోల్డ్ వార్ అనేది సహజం అని బయటపడుతోంది.