Hyderabad News: హైదరాబాద్‌లో చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్‌వరల్డ్-2025 పోటీదారులు సందడి చేశారు. విద్యుత్ కాంతులతో ప్యాలెస్ ధగధగ మెరిసిపోయింది. దాన్ని చూస్తూ మైమరిచిపోయారు అందాల భామలు. 72వ మిస్‌వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పోటీదారులకు గత రాత్రి చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మిస్‌వరల్డ్ అందగత్తెలు సందడి చేశారు. చౌమొహల్లా ప్యాలెస్‌ను చూసి మురిసిపోయారు. మంగళవారం రాత్రి మిస్‌వరల్డ్ పోటీలకు బ్యూటీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా విందు ఇచ్చింది. కంటెస్టెంట్లతోపాటు మిగతా విభాగాలకు చెందిన దాదాపు 300 మంది హాజరయ్యారు.
గతేడాది మిస్‌వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా, మిస్‌వరల్డ్ సీఈఓ జూలియా మోర్లేతోపాటు ముద్దుగుమ్మలు హాజరయ్యారు. ప్యాలస్‌లో మంగళవారం హిందుస్థానీ షహనాయి సంగీత వాయిద్యాలతో బ్యూటీలకు స్వాగతం లభించింది. పాత బస్తీ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే మహిళలు వారికి ఆహ్వానం పలికారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. అలాగే దక్షిణాఫ్రికా, గయానా, సీషెల్స్, పెరూ, వెనెజువెలా, పనామా, నేపాల్, ఇండోనేసియా, గినియా, కామెరూన్ దేశాల రాయబారులు అటెండ్ అయ్యారు. మిస్‌వరల్డ్ పోటీదారులకు చౌమొహల్లా ప్యాలెస్ గురించి ప్రత్యేకత, సిటీలో చారిత్రక నిర్మాణాలు, కట్టడాల విశిష్టతపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు.
ALSO READ: గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు.. అంతా రెడీ చేసిన ప్రభుత్వం
ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పోటీదారులు తిలకించారు. అలాగే నిజాం వంశస్థుల సింహాసనం, వారు ఉపయోగించిన వస్తువులు, సైనిక సామగ్రి గమనించారు. పసందైన హైదరాబాదీ వంటకాలతో ప్రభుత్వం ఇచ్చిన విందును అందాల భామలు, హాజరైనవారు ఆస్వాదించారు. ఏర్పాట్లపై ప్రభుత్వానికి పోటీదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. అలాగే సికింద్రాబాద్ మిలిటరీ కళాశాల కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షినె, నటుడు నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, హీరోయిన్ శ్రీలీల, ఈనాడు సీఎండీ సీహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ 2025- తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హీరో అక్కినేని నాగార్జున#MissWorld2025 #Hyderabad #TelanganaZaroor pic.twitter.com/dahhD87NwX
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2025