BigTV English
Advertisement

Aravind Kejriwal: ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను: కేజ్రీవాల్

Aravind Kejriwal: ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను: కేజ్రీవాల్

Will not resign, Says Kejriwal: తాను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. అయితే, ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్ప్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైలు నుంచే తాను పాలనా వ్యవహారాలు చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని.. అయితే, తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయబోనని ఆయన అన్నారు.


బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరవుతూ.. గతంలో తాను ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ పదవిని వదులుకుని ఢిల్లీలోని మురికివాడల్లో పని చేశానని, అయితే, 2013లో సీఎం అయ్యి 49 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఆరోజు మాత్రం ఎందుకు రాజీనామా చేశావని ఎవరూ అడగలేదన్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని, ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోనని కేజ్రీవాల్ అన్నారు.

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ ను ఓడించడం కష్టమని భావించే ప్రధాని మోదీ తనను అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులతో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలను బీజేపీ అరెస్ట్ చేయించిందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఓ పెద్ద బూటకమన్నారు. అయితే, తాను ఒకవేళ రాజీనామా చేస్తే దేశంలో ఉన్న మిగతా ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లే అవుతుందని ఆయన ఆరోపించారు. తరువాత తమిళనాడు సీఎం స్టాలిన్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా అరెస్ట్ చేయొచ్చవచ్చని.. అందుకే తాను రాజీనామా చేయబోనని కేజ్రీవాల్ అన్నారు.


Also Read: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఎప్పుడంటే..?

కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనని జైలులో ఎంతో వేధించారని ఆయన ఆవేదన చెందారు. అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఏం చేయలేరన్నారు. వారి ప్రయత్నాలు ఎప్పటికి కూడా ఫలించవంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జైలులో ఉండే ఢిల్లీ పాలన బాధ్యతలను నిర్వర్తించేందుకు వీలు కల్పించాలని కోరుతూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తానంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మానీలాండరింగ్ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన తిరిగి జైలుకు వెళ్లనున్నారు.

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×