Guttha jwala: సమాజంలో ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీకి గుర్తింపు ఇచ్చేందుకు వారిని ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించే ప్రక్రియను ప్రారంభించింది. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం ట్రాన్స్ జెండర్లకు పరీక్షలు నిర్వహించారు.
Also Read: Sanju Samson: ఐపీఎల్ 2025 పై సంజూ సంచలన నిర్ణయం!
ఈ నియామక ప్రక్రియకు 58 మంది ట్రాన్స్ జెండర్లు హాజరవ్వగా.. వారిలో 44 మంది 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ పుట్ పోటీల్లో ఎంపికయ్యారు. అయితే ఈ 44 మంది శారీరక సామర్థ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ వైద్య మరియు నేపథ్య తనిఖీకి లోబడి వారిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో 39 మంది ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి బంజారాహిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్ జెండర్ లకు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించిన గుర్తులు, డ్రిల్ నిర్వహించారు.
ఇక సోమవారం (నేటి) నుంచి ఈ 39 మంది ట్రాన్స్ జెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. “తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి సి.వి ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం {Gutta jwala} కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారబోతోంది.
ట్రాన్స్ జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించనుంది. ట్రాన్స్ జెండర్ లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంతో.. వారిని కలుపుకుని పోవడమే కాకుండా మన సమాజంలో వారికి అధికారిక గుర్తింపును కూడా అందించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం చుడుతుంది” అని ట్వీట్ చేశారు.
Also Read: America under-19 cricket: అమెరికా జట్టు కెప్టెన్ గా తెలుగమ్మాయి
ఇక ఆదివారం రోజు వీరి నియామకం పట్ల సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్ జెండర్ లు ఎంతో వివక్షతకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వీరికి సమాజంలో గౌరవం ఇవ్వాలని , సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
What a great initiative absolutely brilliant and revolutionary move by @revanth_anumula @TelanganaCMO @CVAnandIPS
Recruitment of transgenders by Hyderabad police has not only given them inclusivity but also a formal recognition in our society!!
This move definitely is a huge…— Gutta Jwala 💙 (@Guttajwala) December 23, 2024